నాటి రోజుల్లో మందాకినీ మ‌గ అభిమానులు ఏం చేసేవారంటే...

కపిల్ శర్మ షో రాబోయే ఎపిసోడ్‌లో మందాకిని( Mandakini ), సంగీతా బిజ్లానీ( Sangeeta Bijlani ) మరియు వర్షా ఉస్గాంకర్( Varsha Usgankar ) గెస్ట్‌లుగా కనిపించబోతున్నారు.సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక క్లిప్‌ను పంచుకుంది.

 What Did The Male Fans Of Mandakini Do In Those Days , Mandakini, Varsha Usgank-TeluguStop.com

దీనిలో షో హోస్ట్ కపిల్ శర్మ మందాకినిని సరదాగా ఆటపట్టించడం చూడవచ్చు.పెళ్లయిన పురుషులు మందాకిని ఫోటోను జేబులో పెట్టుకునేవారు.

మందాకిని గురించి అందరికి తెలిసిందే, ఆమె మొదటి సినిమా రామ్ తేరి గంగా మైలీ.అప్పుడు అందరూ ఆమెపై ఎంతో క్రేజీ అయ్యారు.

భార్యపై భయంతో ఇంట్లో మందాకిని పోస్టర్లు అతికించ‌లేని పురుషులు.భార్య ఫొటో వెనుక ఆమె ఫొటో పెట్టుకుని తిరిగేవార‌ని చెబుతారు.

మందాకినితో పాటు సంగీతా బిజ్లానీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను లాగడానికి కపిల్ శ‌ర్మ ప్ర‌య‌త్నించాడు.అతను సంగీతా చిత్రాల థీమ్‌ను ఎగతాళి చేశాడు.

సంగీత న‌టించిన‌ చాలా చిత్రాలకు హంతకుడు, క్రైమ్, ఆయుధం లాంటి టైటిల్స్ ఉన్నాయని, ఆ సినిమాల‌ను స్క్రిప్ట్ రైటర్ రాశారా లేదా జైలు నుండి విడుదలైన నేరస్థులా అని క‌పిల్ ఆట‌ప‌ట్టించారు.మీరు ఎప్పుడైనా ధృవీకరించారా అని ఆమెను అడిగాడు.

మందాకిని 80వ దశకంలో అందమైన మరియు బోల్డ్ నటి.మందాకిని రామ్ తేరి గంగా మైలీ ( Ram Teri Ganga Miley )చిత్రంలో కొన్ని ప్ర‌త్యేక సన్నివేశాలలో న‌టించింది.అవి నేటికీ ప్రాచుర్యం పొందాయి.ఈ చిత్రంలో మందాకినికి పాలిచ్చే సన్నివేశం, పారదర్శకమైన చీరలో స్నానం చేసే సన్నివేశం కారణంగా అప్పట్లో వివాదం చెలరేగింది.కపిల్ షోలో మందాకినితో పాటు సంగీతా బిజ్లానీ మరియు వర్షా ఉస్గాంకర్ కూడా కనిపించనున్నారు.వర్షా 90లలోని అనేక సూపర్‌హిట్ చిత్రాలలో న‌టించింది.1991లో వచ్చిన మహేష్ భట్ చిత్రం సాథిలో వర్ష న‌ట‌న ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.ఈ సినిమా మాత్రమే కాదు దీనిలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

వర్షా ఉస్గావ్కర్ మరాఠీలోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా న‌టించారు.

ఫోటోషూట్‌తో సంచలనం మందాకిని లాగే వర్ష సెమీ న్యూడ్ ఫోటోషూట్ కూడా 90వ దశకంలో సంచలనం సృష్టించింది.ఆ సమయంలో వర్షా పేరు చాలా మంది కళాకారులతో ముడిపెట్టారు.అయితే ప్రముఖ సంగీత దర్శకుడు రవిశంకర్ శర్మ కుమారుడు అజయ్ శర్మను ఆమె వివాహం చేసుకుంది.

వర్షా అమాయకత్వం, స్టైల్ అందరినీ పిచ్చెక్కించేవి.వర్షా పెళ్లయ్యాకకూడా కెరీర్ పీక్‌లో ఉంది.

కపిల్ షోలో ఆమె లుక్ మారిపోయిన క‌నిపిస్తుంది.మునుపటికి, ఇప్ప‌టికి ఆమెలో వచ్చిన మార్పుల‌ను గుర్తించ‌డం ఎవ‌రికైనా క‌ష్టంగానే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube