తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Former minister Srinivas Goud ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఉద్యోగులకు ఏమీ చేయలేదని మండిపడ్డారు.ఈ క్రమంలో హెల్త్ పాలసీ, ఓపీఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పోలీస్ శాఖలో ఒకే విధానం ఉండాలన్నారు.బిల్లులు సక్రమంగా అందడం లేదన్న శ్రీనివాస్ గౌడ్ నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్, బీజేపీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.