ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద, రక్షణ ప్లాట్‌ఫారమ్‌లు,వివిధ రకాల క్షిపణులను తయారు చేయడం ద్వారా భారతదేశం ఏరోస్పేస్ ప్రపంచంలో తన సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది.ఆకాశ్ క్షిపణి అత్యంత విజయవంతమైన క్షిపణుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
సైన్యం వద్ద ఇప్పటికే ఆకాష్ క్షిపణుల రెండు రెజిమెంట్లు ఉన్నాయి.ఆకాష్ క్షిపణికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపకల్పన చేసింది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సహకారం అందించింది.ఇది భారత సైన్యం, వైమానిక దళంలోకి ప్రవేశించిన అత్యంత విజయవంతమైన స్వదేశీ క్షిపణులలో ఒకటి.
ఈ క్షిపణిని 2014లో భారత వైమానిక దళంలో, 2015లో భారత సైన్యంలోకి చేర్చారు.96 శాతం స్వదేశీ సాంకేతికత ఆధారంగా, ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన క్షిపణి వ్యవస్థ, ఇది ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వంచే ఆమోదం పొందింది.డిఫెన్స్ ఎక్స్‌పో, ఏరో ఇండియా వంటి అనేక అంతర్జాతీయ ప్రదర్శనల సందర్భంలో కూడా ఈ ఈ క్షిపణిని ప్రదర్శించారు.తూర్పు ఆసియా, ఆఫ్రికాలోని 9 దేశాలు ఆకాష్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి.
ఆకాష్ ప్రైమ్ క్షిపణులు మెరుగైన ఖచ్చితత్వం కోసం స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF)తో అమర్చబడి ఉంటాయి.

ఆకాష్ తన పాత వెర్షన్ వలె కాకుండా, ప్రైమ్ క్షిపణి అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో ఎక్కువ విశ్వసనీయతను నిర్ధారించడానికి అప్‌గ్రేడ్ చేశారు.ప్రస్తుతం ఉన్న ఆకాష్ ప్రైమ్ సిస్టమ్ ట్రయల్స్ సమయంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్వాసాన్ని మరింతగా పెంచింది.క్షిపణిని 4,500 మీటర్ల ఎత్తులో అమర్చడం ద్వారా దాదాపు 25-30 కి.మీ దూరంలో లక్ష్యాన్ని చేధించవచ్చు.