2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) జైల్లో ఉన్నప్పటికి పొత్తును బలోపేతం చేసేందుకు పవన్ వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు కూడా.అటు తెదేపాకూడా సమన్వయ కమిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది.
దీంతో వీలైనంతా త్వరగా సీట్ల పంపకలు, పోటీ అంశం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా టీడీపీకి( TDP ) ఏ ఏ సీట్లు కేటాయించాలి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారట టీడీపీ శ్రేణులు.

ప్రస్తుతం అధినేత జైల్లో ఉండడంతో ఆయనను బయటకు తీసుకురావడంపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే ప్రస్తుతం టీడీపీ ఎలాంటి పరిస్థితిలో ఉన్న సీట్ల విషయంలో మాత్రం పవన్ నిక్కచ్చిగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఉత్తరాంధ్రలో ( Uttarandhra )మెజారిటీ సీట్లను పవన్ డిమాండ్ చేస్తున్నారట.ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా టీడీపీ శ్రేణులు కూడా పవన్ కోరిన సీట్లను ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నట్లు టాక్.
రాయలసీమ విషయానికొస్తే జనసేనకు పెద్దగా పట్టు లేదు.కర్నూల్ కడప వంటి జిల్లాల్లో వైసీపీ( YCP ) ప్రభావం ఎక్కువగా ఉంటే అనంతపురం, చిత్తూర్ లోని కొన్ని నియోజిక వర్గాల్లో టీడీపీ బలంగా ఉంది.

ఇక జనసేన( Janasena ) సీమలో అసలు ఉందా లేదా అన్నట్లుగానే ఉంది.అందుకే సీమను పవన్ లైట్ తీసుకొని పూర్తిగా టీడీపీకే మద్దతుగా నిలవనున్నారట.దీంతో ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుందనేది పవన్ ప్లాన్ గా తెలుస్తోంది.అయితే క్షేత్ర స్థాయిలో టీడీపీ జనసేన పొత్తును కొందరు కొందరు జనసైనికులు జీర్ణించుకోలేకున్నారని టాక్ వినిపిస్తోంది.
పవన్ ఒంటరిగానే పోటీ చేయాలని వారు భావిస్తున్నారు.అయితే వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో జట్టు కట్టడమే మంచిదని మొదటి నుంచి భావిస్తున్న పవన్.
ఇటీవల పొత్తును కన్ఫర్మ్ చేశారు.మరి రెండు పార్టీల పొత్తు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.