ఇదెక్కడి కాంబినేషన్ అయ్యా బాబు.. పెరుగులో గులాబ్‌జామూన్ అట!

ఈ రోజుల్లో వంట మనుషులు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసినట్లు వివిధ రకాల ఫుడ్ ఎక్స్‌పరిమెంట్స్ చేస్తున్నారు.ఫుడ్స్ కంబైన్ చేసి వింత టేస్టులను ప్రజలకు అందిస్తున్నారు.

 What A Combination Here,gulab Jamun In Curd! Viral , Gulab Jamun, Curd, New Vira-TeluguStop.com

ఐస్‌క్రీమ్ దోశ లాంటి పిచ్చి కాంబినేషన్స్‌తో మరికొందరు హడల్‌ పుట్టిస్తున్నారు.తాజాగా ఇలాంటి విడ్డూరమైన మరో కాంబినేషన్ వెలుగులోకి వచ్చింది.

గులాబ్ జామూన్, పెరుగు అనే రెండు వేర్వేరు పదార్థాలను ఒక స్ట్రీట్ ఫుడ్ వెండార్ తయారు చేస్తూ వీడియోకి చిక్కాడు.ఫుడ్ వ్లాగర్ గౌరవ్ వాసన్ ఈ ప్రత్యేకమైన కాంబో ఫుడ్ చూసి ఆశ్చర్యపోయాడు.

తర్వాత ఈ డిష్ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) పంచుకున్నాడు.అప్పటినుంచి ఆ వీడియో దాదాపు 10 లక్షలు వ్యూస్‌తో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో గులాబ్ జామూన్‌( Gulab jamun )తో పాటు ప్లేట్‌లో పెరుగు కనిపించింది.ఒక్కో ప్లేట్ ధర రూ.50గా దుకాణదారుడు అమ్ముతున్నాడు.గులాబ్ జామూన్‌ పెద్దగానే కనిపించింది.

ఒక ప్లేట్ లో అతడు స్వీట్ సిరప్ కూడా పోశాడు.తర్వాత ఒక గంటెడు గడ్డ పెరుగు ఆ ప్లేట్‌లో వేశాడు.

ఆపై కస్టమర్‌కు సర్వ్ చేశాడు.దీని రుచి ఎలా ఉందో వ్లాగర్ చెప్పలేదు.

గులాబ్ జామూన్‌ తియ్యగా ఉంటుంది.పెరుగు( Curd ) రుచి దీనికి చాలా భిన్నంగా ఉంటుంది.ఇవి రెండూ కలిస్తే అది చాలా బ్యాడ్ టెస్ట్ ఉంటుందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని తమ కోరికను బయటపెట్టారు.

పెరుగుకి ప్రోబయోటిక్ స్వభావం ఉంటే.గులాబ్ జామూన్‌కు వేయించిన తీపి రుచి ఉంటుంది.

ఇవి రెండూ కలిపితే రుచి దారుణంగా ఉంటుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube