హెల్మెట్ ధరిస్తే మాత్రమే చాలదు.. ఈ నిబంధనను కూడా పాటించాలి..!

ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్స్‌ ప్రాణాలను రక్షిస్తాయి.హెల్మెట్ కారణంగా ఇప్పటికే మృత్యువు నుంచి ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు తప్పించుకోగలిగారు.

 Wearing A Helmet Is Not Enough This Rule Should Also Be Followed , Road Accident-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.హెల్మెట్ ఎంత ముఖ్యమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది.

అయితే టూవీలర్స్‌ తాము ధరించే హెల్మెట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయితే.

అది నాణ్యమైనది గా ఉండటం కూడా తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి.

హెల్మెట్ బలమైన మెటీరియల్‌తో తలంతా కవర్ చేసేలా తయారు చేసి ఉంటేనే ఎలాంటి చలాన్స్ పడవు.

లేదంటే ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.తల మొత్తం కవర్ చేసేలా ఉంటే వాహనదారుడికి గాయాలు అవ్వవు.

అప్పుడు చనిపోయే ప్రమాదం తగ్గుతుంది కొందరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా తమ బండి వెనక కట్టుకుంటారు.ఇది కూడా నిబంధనలను ఉల్లంఘించినట్లే.

Telugu Helmet, Road, Wheelers, Latest-Latest News - Telugu

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్ బరువు కనీసం 1.2 కేజీలు ఉండాలి.అలానే హెల్మెట్‌ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉండాలి.20-25 మిమీ మందంతో దృఢంగా ఉండాలి.ISI మార్క్ ఉన్న హెల్మెట్‌లను మాత్రమే వాడాలి.ఐఎస్‌ఐ మార్క్ లేని హెల్మెట్‌లు ధరించడం, అమ్మడం కూడా చట్టరీత్యా నేరమేనని ట్రాఫిక్ రూల్స్ పేర్కొంటున్నాయి.అలానే హెల్మెట్ BIS సర్టిఫికేట్ కలిగి ఉండాలి.అలాగే హెల్మెట్ ధరించిన వారు తమ తలనుంచి అది పడిపోకుండా స్ట్రాప్స్‌ గట్టిగా కట్టుకోవాలి.

ఇవేమీ పాటించకుండా ఏదో ఒక హెల్మెట్ ధరించి రోడ్లపైకి వస్తే జరిమానాలు చెల్లించుకోక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube