Janasena Nagababu : వైసీపీ కంటే మెరుగైన పథకాలు అందిస్తాం జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది.

పొత్తులు, అభ్యర్థులు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలలో ప్రధాన పార్టీల నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.

ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu ) మరోపక్క వైసీపీ అధినేత సీఎం జగన్ ఒక రోజు గ్యాప్ లో ఇద్దరు ఢిల్లీ టూర్ వెళ్లడం రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది.

వచ్చే ఎన్నికలకు 2014 మాదిరిగా పొత్తులు ఉండాలని చంద్రబాబు బీజేపీని కూడా కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

We Will Provide Better Schemes Than Ycp Janasena Leader Nagababu Sensational Co

పరిస్థితి ఇలా ఉంటే జనసేన నాయకుడు నాగబాబు( Janasena Leader Nagababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ( YCP ) కంటే మెరుగైన పథకాలు అందిస్తామని అన్నారు.భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువత.

Advertisement
We Will Provide Better Schemes Than Ycp Janasena Leader Nagababu Sensational Co

తెలుగుదేశం- జనసేన కూటమి( TDP Janasena Alliance )కి అండగా నిలవాలని సూచించారు.మేము అధికారంలోకి వస్తే వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు, ఉచిత వైద్యం అందిస్తాం.

ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ నేతల చెంప పగలగొట్టి తమ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రజలు నిలదీయాలని నాగబాబు పిలుపునిచ్చారు.సీఎం జగన్ ఒక సైకో.

ఓట్ల కోసం మనుషులను కులాల వారీగా విడదీస్తున్నారు అని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాజమౌళి 2027 లో మహేష్ బాబు సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు