దేశంలో గత కొంత కాలంగా మోదీ జపం జరుగుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి నాయకుడు దేశానికి ఒక్కరుంటే చాలని పొగిడిన నోళ్లే ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నాయి.
ముఖ్యంగా కేంద్ర తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.దీన్ని బట్టి రానున్న రోజుల్లో బీజేపీ గడ్డుపరిస్దితులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎదురవ్వడంలో ఆశ్చర్య పడవలసిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ముఖ్యంగా రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా వేలాది మంది రైతులు 100 రోజులకు పైనే ఆందోళన చేస్తున్నారు.కనీస మద్దతు ధర కూడా కోల్పోయేలా ఆ చట్టాలు ఉన్నాయని నిరసనలు చేపడుతున్నారు.అయినా కేంద్రం కనికరించడం లేదు.ఈ నేపధ్యంలో రైతునేత బల్బీర్ సింగ్ రజేవాల్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తిరిగి బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా చూస్తాం అని వెల్లడిస్తున్నారట.
పశ్చిమ బెంగాల్లో ఈ సారీ ఎలా అయినా అధికారం దక్కించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ జోరుగా ప్రచారం చేశారు.కానీ మేము ముందుగా అక్కడికి వెళ్లి భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడకుండా చేస్తాం అంటూ సవాల్ విసిరారు.
మరి ఈ పోరులో బీజేపీ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.