ఏపీలో ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిశారు.ఈ మేరకు రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.వైసీపీ ప్రభుత్వానికి చివరి ఘడియలు వచ్చాయని తెలిపారు.
ప్రజలకు ఓట్లు లేకుండా చేయాలని అరాచకాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.వాలంటరీ వ్యవస్థను పెట్టి ఓట్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే ఎన్నికల సంఘానికి 13 లేఖలు ఇచ్చామని తెలిపారు.అదేవిధంగా త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని వెల్లడించారు.







