తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి, హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రాధిక.
అప్పట్లో శోభన్ బాబు, కృష్ణ, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి వారి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.సినిమాలలో విభిన్న పాత్రలో నటిస్తూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.
ఇక ఆమె నటనకు స్వాతిముత్యం, స్వాతి కిరణం లాంటి సినిమాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పువచ్చు.
అయితే ఈ తరం వారికి రాధికా గురించి ఎంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులు ఆమెను మరిచిపోలేరు.ఇదిలా ఉంటే తాజాగా రాధిక ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది.ఈ క్రమంలోనే ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రాధికా మాట్లాడుతూ.నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే.
.శ్రీలంక హాస్టల్లో చదువుకున్నాను, కొంతకాలం పాటు లండన్ లో కూడా చదువుకున్నాను.
లండన్ నుంచి వచ్చినప్పుడు భారతీ రాజా గారు నన్ను సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు అని తెలిపింది రాధిక.అయితే ఆమె లండన్ నుంచి వచ్చినప్పుడు చెన్నైలోని ఒక ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకున్నారట.
అయితే అంతకుముందు ఆ ఏరియాలో ఆ ఇంట్లోనే మర్డర్ జరిగింది అన్న విషయం ఆమెకు తెలియదట.ఆ విషయం తెలియక పోవడం వల్లనే సరిగ్గా ఆ ఇంట్లోకి రెంట్ కీ దిగాము అని చెప్పుకొచ్చింది రాధిక.ఈ విషయం తెలిసిన తరువాత ఆ కంగారు పడి వీలైనంత త్వరగా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి వెళ్లి పోయాము అని తెలిపింది.అయితే ఆమె స్నేహితురాలు ఈ ఆల్బమ్ లో ఆమె ఫోటో ని చూసి భారతీ రాజా అతని సినిమాలో నటించడం కోసం రాధికను అడగడానికి ఆమె ఇంటికి వచ్చారట.
ఆ సమయంలో భారతీరాజా అంటే ఎవరో తనకు తెలియదని, అయితే భారతీరాజా గిరజాల జుట్టు తో ఉండటంతో అతను హంతకులు అనుకొని లోపలికి రావద్దు అని గట్టిగా అరవగా ఇంతలో రాధిక వాళ్ళ అమ్మ వచ్చిభారతీరాజా గారిని లోపలికి పిలిచిందట.