విశాఖ( Visakhapatnam )లోని రుషికొండ( Rushikonda )లో భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) అన్నారు.సువిశాలమైన ప్రాంతంలో భవనాలు నిర్మించామన్న ఆయన భవనాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టు( Tourism project )గా మాత్రమే ఈ భవనాలు పని చేస్తామని చెప్పారు.మరి కొంత నిర్మాణం జరగాల్సి ఉందన్న మంత్రి గుడివాడ ఇప్పటికే ప్రభుత్వ అధికారుల బృందం కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు.ప్రభుత్వ అధికారుల బృందం సిఫార్సుతో పరిపాలన భవనంగా వినియోగించే అంశం ఆలోచిస్తున్నామని వెల్లడించారు.