రాకేష్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటాం: గణేష్ మాస్టర్

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh Maste r) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం కన్ను మూసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోమవారం రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు బోరుబండలోని స్మశాన వాటికలో జరిగాయి.

 We Stand By Rakesh Masters Family Ganesh Master , Charan,jani Master, Ganesh Mas-TeluguStop.com

ఇక ఈయన అంత్యక్రియలలో భాగంగా ఎంతో మంది డాన్స్ కొరియోగ్రాఫర్లు ఆయన శిష్యులు పాల్గొన్నారు.ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శేఖర్ మాస్టర్ ( Sekhar Master ), జానీ మాస్టర్( Jani Master ) రాకేష్ మాస్టర్ పాడి మోసారు.

రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ ( Charan )తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు.

Telugu Charan, Ganesh Master, Jani Master, Rakesh Master, Sekhar Master, Tollywo

ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు.ఈ క్రమంలోనే రాజేష్ మాస్టర్ మరణించిన తర్వాత ఆయన కుటుంబానికి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకుంటామంటూ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్( Ganesh Master) కామెంట్ చేశారు.మేము రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్న నేర్చుకోకపోయినా ఆయన మాకు ఎప్పటికీ గురువుగారే.

ఆయన మరణాంతరం తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడకుండా తామందరం అండగా ఉంటామని తెలియజేశారు.

Telugu Charan, Ganesh Master, Jani Master, Rakesh Master, Sekhar Master, Tollywo

త్వరలోనే డాన్స్ మాస్టర్ అలాగే యూనియన్ అందరూ కలిసి కూర్చొని ఈ విషయం గురించి మాట్లాడుతామని రాకేష్ మాస్టర్ కుటుంబానికి ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా వారి పిల్లల బాధ్యతలను కూడా తాము చూసుకుంటాము అంటూ గణేష్ మాస్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఆపదలో ఉన్నామంటే బయట ఎందరికో సహాయం చేస్తాము అలాంటిది గురువుగారి కుటుంబానికి సహాయం చేయడానికి ఏమాత్రం వెనకాడమని తెలిపారు.ఆయన వద్ద శిష్యరికం పొందినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఉన్నత స్థితిలోనే ఉన్నారని ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube