తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన మరియు మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు అండగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పని చేయాలని తెలిపారు.
పామాయిల్ సాగులో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.ఈ క్రమంలో అధికారులు రైతు సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమన్న మంత్రి తుమ్మల మరో వంద రోజుల్లో ఇతర హామీలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.







