మహిళల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సర్వతోముఖాభివృద్ధికి బారాస ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని, వారికి ఇంకా చాలా చేస్తామంటూ కేటీఆర్( KTR ) వ్యాఖ్యానించారు. “భవిష్యత్తు తెలంగాణలో మహిళలు” పేరిట హైదరాబాదులో ఒక హోటల్లో జరిగిన మీటింగ్ లో వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషించిన మహిళలతో( Women ) జరిగిన మీటింగ్ కు కేటీఆర్ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారంలోకి రాగానే తక్కువ వడ్డీకి మహిళలకు రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చారు.స్త్రీల కోసం ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ,అమ్మ ఒడి వంటి పథకాలు అమలు చేస్తున్నామని మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశామని,

వారి రక్షణ కోసం షీ టీం లను( She Teams ) ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలు సమస్యల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసామని, వారు తమ పేరు కూడా చెప్పకుండానే తమ సమస్యలు వారికి చెప్పుకోవచ్చని ఆయన తెలియజేశారు.వ్యాపార రంగంలో మహిళల శాతాన్ని పెంచడానికి స్త్రీ నిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నామని, అలా తీసుకున్న వారిలో 99 శాతం మందికి మంది తిరిగి చెల్లిస్తున్నారని,భవిష్యత్ భారత్ లో మహిళల పాత్ర గణనీయమైందని ఆయన చెప్పుకొచ్చారు.మా ఇంట్లో కూడా మా చెల్లి డైనమిక్ గా ఉంటుందని ,మా తండ్రి ఇంటిలో అందుబాటు లేకపోవడంతో తల్లిని చూస్తూ చాలా నేర్చుకున్నానని,

తనకు కుమార్తె పుట్టిన తర్వాత తన ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయని అలా మనుషుల జీవితాల్లో స్త్రీలు చాలా ప్రభావంతమైన పాత్ర పోషిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.మహిళల అభివృద్ధి( Women Empowerment ) కోసం మీరే ఒక అజెండా తయారు చేయండి అని డిసెంబర్ 15 లోపు దానిని చర్చించి ప్రభుత్వం మరోసారి అధికారం లోకి రాగానే అమలు చేద్దామంటూ ఆయన చెప్పుకొచ్చారు.డీప్ ఫేక్ అన్నది మహిళలకే కాక మాకు కూడా చాలా ఇబ్బందికరమని రాజకీయాల్లో మమ్మల్ని విమర్శించడానికి పరువు తీయడానికి కూడా ప్రత్యర్థులు ఇలాంటి అస్త్రాలను ఉపయోగించుకోవడం బాధాకరమని టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇతరులను విమర్శించడం పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు
.