జగన్ లా మేము ప్రతీకారం తీర్చుకోమంటున్న రేవంత్!

ఎన్నికలు దగ్గర పడుతుండటం తో అన్నీ ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు మీడియాలకు కూడా వరుస పెట్టి ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.ఇప్పటికే బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్ని ప్రధాన మీడియాలను చుట్టేసి తనదైన శైలి లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేస్తే , ఇప్పుడు కాంగ్రెస్ వంతు అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు .

 We Distance Ourselves From The Person's Past Factions Revanth , Revanth Reddy ,-TeluguStop.com
Telugu Cm Kcr, Jana Sena, Revanth Reddy, Ts, Ys Jagan-Telugu Top Posts

దీనిలో భాగంగానే ఏబీఎన్ అధినేత ఆర్కే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా జనసేన బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేయాలనే నిర్ణయం తప్పని , ఆ పార్టీకి ఆ నిర్ణయం ఏపీలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని, ఇక్కడ ఓట్లు తక్కువ వస్తే అక్కడ సీట్ల సర్దుబాటు పై మరియు తటస్థ ఓటరు పై అది ప్రభావం చూపించవచ్చని ఆయన అభిప్రాయం పడ్డారు .

Telugu Cm Kcr, Jana Sena, Revanth Reddy, Ts, Ys Jagan-Telugu Top Posts

అదే విధంగా కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్( CM KCR ) పై విచారణ ఉంటుందా? అన్న ప్రశ్నకు తాను వ్యక్తిగతంగా కేసీఆర్ పై ఎటువంటి పగ , ప్రతీకార తీర్చుకోనని నన్ను చూస్తే అలా అనిపిస్తుంది ఏమో కానీ నేను ఆ తరహా మనిషిని కాదని, అయితే విధానపరమైన నిర్ణయాలపై మాత్రం ఒక ప్రభుత్వంగా సమీక్ష చేస్తామని ఆ విధంగా చర్యలు తీసుకుంటామే తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లా వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి తాము ప్రయత్నించమంటూ చెప్పుకొచ్చారు.అయితే కీలకమైన ఎన్నికల సమయంలో వైయస్ కుటుంబానికి కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తమను దెబ్బతీస్తాయేమోనని కాంగ్రెస్ శ్రేణులు కలవర పడుతున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా తనకు తెలుగుదేశం అభిమానుల మద్దతు ఉంటే చాలు అన్నట్టుగా రేవంత్ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube