2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి అధికారంలోకి వచ్చేది వైసిపి పార్టీ నే( YCP ) అంటూ స్పష్టం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి.( Sajjala Ramakrishna Reddy ) తమ ప్రభుత్వం అమలుపరచిన సంక్షేమ పథకాల వల్ల తమ బలం 70 శాతం వరకు పెరిగిందని, వ్యతిరేకత ఇంచుమించు 30 శాతం ఉంటుందని, దానిని చీల్చినా, కలుపుకున్నా వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని రానున్న ఏడు నెలల కాలంలో మరో 10 శాతం వ్యతిరేకత పెరుగుతుంది అనుకున్నా కూడా 60% ఓటింగ్ తో తాము మరోసారి గద్దే ఎక్క బోతున్నామంటూ ఆయన స్పష్టం చేశారు.
వ్యతిరేక ఓటును చీల్చుతామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రతిపక్ష పార్టీలు, ఆ వ్యతిరేకత పరిమితంగా ఉందని తెలుసుకోవాలని వాఖ్యనించారు.

ప్రతిపక్షాలది నెగిటివ్ ఓటింగ్ అయితే తమది పాజిటివ్ ఓటింగ్ అని చంద్రబాబు జాతీయ మీడియాలో చెప్పినట్లు అంత భారీ స్థాయిలో టిడిపి( TDP ) బలపడితే పొత్తులు కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.బిజెపితో బాబు బంధాన్ని బలపరచడానికి ఒకవైపు పురందేశ్వరి( Purandeshwari ) మరోవైపు జనసేన అధినేత కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పొత్తు ప్రజలతోనేనని ప్రజల దీవెనలతో మరొకసారి అధికారంలోకి వస్తామంటూ ఆయన తేల్చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ది పరంగా వెనకబడినప్పటికీ సంక్షేమ పధకాల పరంగా దాదాపు సమాజంలోని 90% వెనుకబడిన వర్గాలను మైనారిటీ వర్గాలను కవర్ చేసి ఉన్నామని ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా రమారమి లక్ష రూపాయల ప్రయోజనం ప్రభుత్వం వల్ల కలుగుతుంది అన్న భరోసా అధికార పార్టీకి ఉన్నట్లుగా తెలుస్తుంది .ఆ నమ్మకంతోనే పొత్తులు కలిసి వచ్చిన లేకపోయినా తమకు నష్టం లేదంటూ అధికార పార్టీ ధీమా ప్రదర్శిస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.మరి నిన్న మొన్నటి వరకు పొత్తులపై కొంత ఆందోళన పడినట్లు వ్యవహరించినా అనేక సర్వేల తర్వాత అధికార పార్టీ కొంత ధీమా ను ప్రదర్శించడం గమనార్హం
.






