సినీ నటి సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాశ్మీర్ పండిట్ల హత్య, గో రక్షక దళాలు చేస్తున్న దాడులు రెండు ఒకటేనని ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఈ విధంగా సాయి పల్లవి మతాల గురించి మాట్లాడటంతో భజరంగదళ్ కమిటీ సభ్యులు తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా సాయి పల్లవి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై సాయిపల్లవి స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
కులమతాలు వేరైనా హింస ఒక్కటేనని, ఏ మతానికి చెందిన వారైనా మానవత్వం మర్చిపోతే ప్రయోజనం లేదని ఆమె తెలిపారు.
ఒక డాక్టర్ గా ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు.కేవలం తాను మాట్లాడిన ఇంటర్వ్యూ పూర్తి చూడకుండా కొందరు ఇలాంటి మూస దాడులను ప్రోత్సహిస్తున్నారు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచాలని ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు నా మాటలతో బాధపడి ఉంటే క్షమించండి అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

ఈ విధంగా ఈ వివాదం ఇక్కడితో ముగిసింది అనుకునే లోపు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సాయిపల్లవి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రకాష్ ఆ సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవిని సమర్థిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది.ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మానవత్వమే అన్నిటికన్నా ముఖ్యం.
సాయి పల్లవి నీ వెంటే మేమున్నాం అంటూ ఈయన కామెంట్ చేశారు.ఈ విధంగా ప్రకాష్ రాజ్ కామెంట్ చేయడంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది.







