ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం కేంద్రం సంక్షేమం నేరుగా అందిస్తున్నాం రేషన్ బియ్యం కేంద్రం ఇస్తోంది.ఇంటి నిర్మాణానికి లక్షా80వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది వాలంటర్ కి జీతం ఇచ్చి పోలింగ్ బూత్ లో పికె సలహా తో వైసీపీ ప్రభుత్వం వాడుతోంది ఉత్తరాంధ్ర జిల్లా ల్లో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ రాయలసీమ లో ప్రాజెక్టులు పరిస్థితి ఇదే పరిస్థితి అందుకే రాయలసీమ రణభేరి ఈనెల 19వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం.
లస్కర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అందుకే వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా మారింది వైసీపీ అధికారంలోకి వస్తే 2.3లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు.ఉపాధ్యాయ ఖాళీలు కోసం మెగా డిఎస్సీ ఇంతవరకు తీయలేదు.పోలీసు రిక్రూట్ మెంట్ లేదు,రెవెన్యూ, సివిల్ ఇంజనీరింగ్, విద్యుత్ రంగాల్లో ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు.ఉద్యోగాల కు నోటి ఫికేషన్లు వస్తాయని యువత కోచింగ్ సెంటర్ లకు వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకుంటున్నారు వారికి ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఏంటి ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది ఇంజనీరింగ్ పోస్టులు మాట దేవుడెరుక కనీసం లస్కర్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదూ ప్రభుత్వం నిత్యం ప్రజలకు నేరుగా సేవలు అందించే ఏశాఖ లో ఉద్యోగ నియామకాలు జరపలేదు అందువల్ల పరిపాలన బ్రష్టు పట్టింది.నిరిద్యోగులకు ఈ ప్రభుత్వం లో నిరీక్షణ తప్ప ఫలితం కనపడని పరిస్థితి.
అవుట్ సోర్సింగ్ పేరుతో పార్టీ కార్యకర్తలు ను ప్రభుత్వ శాఖల్లో డంపింగ్ చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.స్వాతాంత్ర్యం వచ్చిన తర్వాత సాగు విస్తరణ జరగణలేదు శ్రీ శైలం ప్రాజెక్టు రక్షణ కు ఛర్యలు తీసుకోవాలి,నిధులు ఇచ్చిన ఇళ్ళు కట్టలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయడం లేదు డ్రిప్ ఇరిగేషన్ నిధులు డైవర్ట చేశారు నిధులు ప్రభుత్వం దోచుకుంటోందా అని ప్రశ్నించారు.మా పార్టీ అగ్ర నాయకులు అమిత్ షా గారు రెండు నెలల క్రితమే తిరుపతిలో మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు.2024 లోనే మేము అధికారంలోకి రావాలని జనసేనతో కలిసి ముందుకెళ్లే అంశంపై స్పష్టమైన సంకేతాలు మాకు అందాయి.ఆ దిశా నిర్దేశం ప్రకారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాము, రానున్న మరికొద్ది రోజుల్లోనే జనసేనతో కలిసి ఉద్యమాలను ఉదృతం చేసి అధికార పార్టీ కంటిపై కునుకు లేకుండా ప్రజల్లోకి వెళ్తాము.వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్ర స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తున్నాము.
పవన్ కళ్యాణ్ గారు మా మిత్ర పార్టీ అధ్యక్షులు.వారితో మా కేంద్ర పార్టీ ప్రతినిధులు అన్ని విషయాలు మాట్లాడతారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజల దుస్థితికి కారణమైన గత, ప్రస్తుత పాలకులకు రాష్ట్ర రాజకీయాల్లో చరమగీతం పాడే దిశగా రానున్న రోజుల్లో బిజెపి-జనసేన మైత్రి మరింత బలపడుతుంది.2024లో సంకీర్ణ ప్రభుత్వాన్ని మా ద్వయం ఖచ్చితం గా ఏర్పాటు చేసి తీరుతుంది.ఈకార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ,బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వంశీ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు
.