దొండ సాగును ఆశించే పండు ఈగలను నివారించే పద్ధతులు..!

దొండ( gourd cultivation ) ప్రధానమైన కూరగాయల పంటలలో ఒకటి.దొండలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది.

 Ways To Prevent Fruit Flies In Gourd Cultivation , Gourd Cultivation , Malathion-TeluguStop.com

కాబట్టి రైతులు దొండ సాగు చేయడానికి కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.పైగా దొండ లాభదాయకమైన పంటగా చెప్పుకోవచ్చు.

అయితే కొన్ని సస్యరక్షక పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చు.దొండ పంటను మొదటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

దొండ పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే పండు ఈగలు పంటను ఆశిస్తే దిగుబడి సగానికి పైగా తగ్గి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

కాబట్టి పండు ఈగలను సకాలంలో గుర్తించి వెంటనే నివారించాలి.ఎప్పుడైతే దొండ పంట పూత దశకు వస్తుందో ఆ సమయంలో తల్లి పండు ఈగలు పూత పై గుడ్లు పెడతాయి.

ఆ తరువాత పూత, పిందెలలో ఈ పండు ఈగలు చేరి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

Telugu Agriculture, Gourd, Latest Telugu-Latest News - Telugu

కాబట్టి దొండ పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు ఈ పండు ఈగలను గుర్తించి నివారించే ప్రయత్నం చేయాలి.ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల మలాథియాన్( Malathion ) నిన్ను కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కొమ్మలు, ఆకులు, పూత పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Telugu Agriculture, Gourd, Latest Telugu-Latest News - Telugu

అంతేకాకుండా 100 మిల్లీలీటర్ల మలాథియాన్ కు 100 గ్రాముల చక్కెర ను కలిపి లీటర్ నీటిలో పోసి కలుపుకోవాలి.ఈ ద్రావణాన్ని మట్టి పాత్రలలో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టుకోవాలి.తద్వారా పండు ఈగల బెడద తొలగిపోతుంది.

ఇక దొండ మొక్క మొదల వద్ద కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.నీరు నిల్వ ఉండకుండా ఇంకిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రమం తప్పకుండా భూమిలో ఉండే తేమశాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.ఇలా చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube