ఎండకాలంలో మొబైల్స్ ఎక్కువ పేలతాయి .. ఈ జాగ్రత్తలు పాటించండి

భాగ్యనగరం అట్టుడికిపోతోంది.నిన్న 42 డిగ్రీల సెల్సియస్ ని దాటిన ఉష్ణోగ్రత, ఈరోజు కూడా అదే రేంజిలో ఉంటుందని వాతావరణ శాఖ రిపోర్టు.

 Ways To Cool Down The Temperature Of Mobile In This Summer-TeluguStop.com

ఇకనుంచి 35-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చూడటం సర్వసాధారణ విషయం.ఈ ఎండల్లో మన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నాం.

మరి మన ఒంట్లోనే కాదు, ఈ ఎండల వలన మొబైల్ ఫోన్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది.అందుకే, ఎండకాలంలో మొబైల్ ఫోన్స్ ఎక్కువగా పేలుతుంటాయి.

ఇది మన ప్రాణాల్ని తీసే ప్రమాదమే కదా? మరి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అందుకే ఈ టిప్స్ పాటించి, మీ స్మార్ట్ ఫోన్ టెంపరేచర్ పెరగకుండా చూసుకోండి.

* ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్స్ దాదాపుగా అన్నీ మెటాలిక్ బాడిలనే కలిగి ఉంటున్నాయి.

అది మనకే మంచిదైనా, వేసవిలో మాత్రం మెటాలిక్ బాడి ఉండటం ద్వారా తొందరగా వేడెక్కిపోతాయి మెటాలిక్ బాడి స్మార్ట్ ఫోన్స్.షియోమి ఫోన్స్ తో ఈ సీజన్ లో అందరికీ ఇదే ప్రధాన సమస్య.

అందుకే, మీ ఫోన్ ఎక్కువగా ఎండకి ఎక్స్ పోజ్ చేయొద్దు.ఎండలో ఎక్కువగా వాడోద్దు.

టెంపరేచర్ తక్కువ ఉన్న ప్రదేశాల్లోనే ఉంచటానికి ప్రయత్నించండి.

* మల్టిటాక్సింగ్ టెంపరేచర్ ని ఇంకా ఎక్కువ పెంచుతుంది.

కాబట్టి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకేసారి వాడొద్దు.ఎప్పటికప్పుడు జంక్ క్లీన్ చేసుకోని, ర్యామ్ స్పేస్ ఉండేలా చూసుకోండి. * సెల్ ఫోన్ టెంపరేచర్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.ఒకవేళ టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే, ఎలాంటి వర్క్ చేయకుండా, ముఖ్యంగా కాల్ చేయకుండా పక్కనపెట్టండి.

షియోమి ఫోన్స్ లో ఇన్బిల్డ్ కూలర్ ఉంటుంది.మిగితా ఫోర్ వారు అలాంటి అప్లికేషన్ పట్టుకోవాలి.

* రాత్రిపూట పూర్తిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.కాస్తైనా ప్రాసెసర్ మీద ప్రెషర్ తగ్గుతుంది.

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో చేసుకునే పనైతే వాటిలోనే చేసుకోని మొబైల్ కి విశ్రాంతినివ్వండి.స్మార్ట్ ఫోన్ ని సాధ్యమైనంతవరకు కాల్స్ కే వాడండి.

మీరు మెసెజింగ్ కూడా కంప్యూటర్ నుంచే చేసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు వాడుకుంటే తప్పేం ఉంది.

* మెటాలిక్ బాడి ఉన్న స్మార్ట్ ఫోన్స్ సహజంగానే ఛార్జింగ్ లో ఉన్నప్పుడు వేడిగా ఉంటాయి.

ఈ టెంపరేచర్ లో ఛార్జింగ్ పెడితే ఆ హిట్ ఇంకా పెరుగుతుంది.మొబైల్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు టాస్కింగ్ వద్దు.

ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా పెట్టవద్దు.ఇక మొబైల్ డేటా తక్కువగా, వైఫై ఎక్కువగా వాడండి.

ఎందుకంటే 4G యూసేజ్ వలన ఫోన్ టెంపరేచర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube