అమెరికా చరిత్రలో అతిపెద్ద కరువు...ఆదుకోవాలంటూ బిడెన్ కు గవర్నర్ల లేఖ..!!

అగ్ర రాజ్యం అమెరికాను ఒక పక్క కరోనా మహమ్మారి డెల్టా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరో పక్క ప్రకృతి సైతం పగబడుతోంది.

నిన్నా మొన్నటి వరకూ అమెరికా అడవులలో రేగిన కారు చిచ్చు లక్షల ఎకరాలను దహించి వేయగా అమెరికాకు తీరని నష్టం ఏర్పడింది.

ఈ మంటల్లో చిక్కుకుని కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, ఆస్థి నష్టం కూడా భారీగానే జరిగిందని అంచనా వేశారు.ఇదిలాఉండగానే అమెరికాను నీటి కష్టాలు ముంచెత్తుతున్నాయి.

చుక్క నీరు జలాశయాలలో లేకపోవడంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.అమెరికాలోని దాదాపు 10 రాష్ట్రాలు నీటి కష్టాలలో కొట్టుమిట్టాడుతున్నాయి.

దాదాపు మెజారిటీ రాష్ట్రాలకు నీరు అందించే అతిపెద్ద జలాశయంగా పేరందిన లేక్ మిడ్ జలాశయంలో నీటి మట్టం భారీగా పతనమయ్యింది.దాదాపు 10 అడుగుల మేరకు నీటి మట్టం పడిపోయిందని ఆయా రాష్ట్రాల గవర్నర్లు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

ఇప్పటికే కరోనా తోనే తమ రాష్ట్రాలు తీవ్ర నష్టాలలో ఉన్నాయని, ఆర్ధిక వృద్ది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ క్రమంలో నీరు లేక మరిన్ని ఇబ్బందులు పడుతున్నామని తమను ఆదుకోమంటూ అధ్యక్షుడు బిడెన్ కు లేఖను రాశారు.నీటి కష్టాలు పడుతున్న మా రాష్ట్రాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి తమకు ఆర్ధిక సాయం అందించాలని కోరారు.

అయితే నీటి కరువుపై స్పందించిన అమెరికా బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ఆరిజోనా, నోవాడా, మెక్సికో కు ఎప్పుడూ అందించే నీటి శాతాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత నీటి ఎద్దడి దృష్ట్యా ఈ నిర్ణయం తప్పదని తెలిపింది.ఇక 10 రాష్ట్రాల గవర్నర్లు బిడెన్ కు రాసిన లేఖలో అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద కరువుగా చెప్పుకొచ్చారు.

నీటి కరువు కారణంగా పంటలు పాడయ్యాయని, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆర్ధిక సాయం అందించాలని కోరారు.పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తాగు నీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు