ఎయిర్ ఇండియా ఫ్లైట్( Air India flight ) ఎక్కిన వారికి వింత అనుభవం ఎదురయింది.2023, నవంబర్ 30 గురువారం నాడు ఎయిర్ ఇండియా విమానం ఓవర్ హెడ్ బిన్ నుంచి వాటర్ లీక్( Water leak ) అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.2023, నవంబర్ 24న గాట్విక్ నుంచి అమృత్‌సర్‌కు( Gatwick to Amritsar ) ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు ఈ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురయ్యింది.పైన నుంచి నీరు కింద ఉన్న ప్రయాణికుల సీట్లపై దారలా పడుతున్నట్లు వైరల్ వీడియో చూపించింది.

వాటర్ లీకేజీకి కారణమేమిటని, ప్రయాణికులు ఎలా ప్రభావితమయ్యారు? అని నెటిజన్లు డౌట్స్ వ్యక్తం చేశారు కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు దీనికి కారణం ఏమై ఉంటుందని క్యూరియాసిటీని వ్యక్తం చేశారు.ఎయిర్ ఇండియా ఇప్పుడు పరిస్థితిని వివరించడానికి, అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడానికి ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రకటన ప్రకారం, విమానం క్యాబిన్ లోపల కండెన్సేషన్ అడ్జస్ట్‌మెంట్ అనే ఓ అరుదైన దృగ్విషయాన్ని అనుభవించింది, దీని ఫలితంగా ఓవర్ హెడ్ బిన్ నుంచి నీరు చేరడం, లీకేజీ ఏర్పడింది.

ఇది భద్రత సమస్య కాదని, ప్రభావిత వరుసలలో కూర్చున్న ప్రయాణికులను వెంటనే ఖాళీగా ఉన్న ఇతర సీట్లకు తరలించామని ప్రకటన పేర్కొంది.క్యాబిన్ సిబ్బంది కూడా అతిథులకు సౌకర్యంగా ఉండటానికి, ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.ఎయిర్ ఇండియా తమ అతిథుల భద్రత, సౌకర్యానికి కట్టుబడి ఉన్నామని, ఈ ఊహించని సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది.







