ఏపీ పాఠశాలలలో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్స్..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత( Heat Wave ) పెరుగుతూ ఉంది.ఉదయం 10 గంటలకే సూర్యుడు భగ భగ మంటున్నాడు.

 Water Bells Three Times A Day In Ap Schools, Water Bells, Ap Government,water Be-TeluguStop.com

దీంతో రోడ్లపై జనాలు రావటానికి భయపడే పరిస్థితి నెలకొంది.ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.

ఈ ఏడాది ఎక్కువ వేడి గాలులు వీచే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది.దీంతో వేసవి కావడంతో ఏపీ ప్రభుత్వం( AP Govt ) అప్రమత్తం అయింది.

ప్రస్తుతం ఏపీ పాఠశాలలలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి.కాగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో “వాటర్ బెల్స్”( Water Bells ) మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

విద్యార్థులలో డీహైడ్రైషన్( Dehydration ) మోప్పున నివారించేందుకు రోజుకు మూడుసార్లు వాటర్ బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది.ఉదయం 8:45, 10:50, 11:50 కి గంట కొట్టాలని పేర్కొంది.ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులు( Students ) క్రమం తప్పకుండా మంచి నీటిని తాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.పాఠశాలలలో విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లు ఐదు నిమిషాల పాటు వాటర్ బ్రేక్ ఇవ్వాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళ( Kerala )లో కొన్ని బడులలో ప్రారంభించారు.అక్కడ నుంచి మంచి స్పందన రావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube