చిత్తూరు నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడి రాజకీయ వారసుడు గాలి భానుప్రకాశ్ నాయుడు దూకుడుగా ఉన్నారా? సైలెంట్‌గానేఉన్నా.చక్రం బాగానే తిప్పుతున్నారా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాస్తవానికి టీడీపీ పుట్టిమునిగిపోతుం దని అనుకున్నారు.ఎమ్మెల్యే రోజా.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి దూకుడు ముందు గాలి వారసుడి రాజకీయం ఇక, ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు.
ప్రధానంగా ఇంటి నుంచే రాజకీయంగా మద్దతు లేకపోవడం మైనస్‌గా మారింది.పైగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.సంక్షేమం వంటివి.వైసీపీ దూకుడుకు కారణాలుగా మారితే.
టీడీపీలో నైరాశ్యం పేరు కుపోయింది.కొన్నాళ్లుగా గాలి భాను మౌనంగానే ఉన్నా.
పంచాయతీ ఎన్నికల సమయానికి మాత్రం.తనతండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే బలమైన ఆకాంక్షతో ముందుకు కదిలినట్టు తెలుస్తోంది.
తనే స్వయంగా రంగంలోకి దిగి.టీడీపీలో ఉత్తేజం వచ్చేలా చేశారు.
ఫలితంగా నగరి నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ పోరులో.టీడీపీ 25 పంచాయతీను కైవసం చేసుకుంది.

పైకి వైసీపీ మాత్రం టీడీపీ గుండుగుత్తుగా ఓడిపోయిందని.తాము పుంజుకున్నామని ప్రచారం చేసుకు న్నా.ఈ 25 పంచాయతీల విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.ఈ పరిణామాలు నిజంగానే టీడీపీలో పునరుత్తేజాన్ని నింపాయనడంలో సందేహం లేదు.అసలు టీడీపీ అడ్రస్ కూడా కనిపించడం కష్టమని అనుకున్న సమయంలో అనూహ్యంగా పుంజుకోవడంతోపాటు.మా ఉనికిని ఎవరూ తుడిచేయలేరు.
అనే సంకేతాలను బలంగానే పంపినట్టు చెబుతున్నారు.మొత్తానికి గాలి వారసుడు.
తన పట్టును కోల్పోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.