Srikanth : ఆ స్టార్ హీరో వల్లే శ్రీకాంత్ ఊహల పెళ్లి జరిగిందా..?

ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్స్ అయినా శ్రీకాంత్ ఊహ ( Srikanth-Ooha ) లది ప్రేమ వివాహం.ఇక వీరి పెళ్లి అంత సులభంగా జరగలేదట.

వీరి మధ్య ఎన్నో సంవత్సరాలు రహస్యంగా ప్రేమను దాచి ఆ తర్వాత ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

అయితే శ్రీకాంత్ ని ఊహకి ఇచ్చి పెళ్లి చేయడానికి శ్రీకాంత్ తల్లిదండ్రులు మొదట్లో ససేమిరా అన్నారట.కానీ ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వడంతో అంతా సర్దుమనిగిందట.మరి ఆ స్టార్ హీరో ఎవరు.

శ్రీకాంత్ ఊహల పెళ్లికి ఏ విధంగా సహాయం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీకాంత్ ఊహలు "ఆమె(Aame)" అనే సినిమాలో నటించే టైంలో ప్రేమలో పడ్డారు.

Advertisement

ఈ సినిమా తర్వాత దాదాపు మూడు సినిమాల్లో కలిసి నటించారు.అయితే అప్పటికే వీరి మధ్య ప్రేమ ఉంది కానీ ఎక్కడ కూడా వీరి ప్రేమను బయట పెట్టలేదు.

కానీ ఊహ ( Ooha ) తల్లిదండ్రులు అప్పటికే ఊహకి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లి చేయాలని చూసారట.ఇక అప్పటికే శ్రీకాంత్ తో ఊహ పీకల్లోతు ప్రేమలో ఉంది.

దాంతో అసలు విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఊహ ఇంటికి నేరుగా వెళ్లి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట.కానీ ఊహ తల్లిదండ్రులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.

సినీ ఇండస్ట్రీ నుండి మా అమ్మాయికి భర్త ని తీసుకురావడం మాకు ఇష్టం లేదని చెప్పారట.దాంతో శ్రీకాంత్ చాలా బాధగా ఇంటికి వెళ్లారట.కానీ ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఎలాగైనా శ్రీకాంత్ కి ఊహకి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఊహ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి శ్రీకాంత్ ఎంత మంచివాడో ఆయన గొప్పతనం ఏంటో వాళ్లకి చెప్పారట.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

దాంతో అప్పుడప్పుడు శ్రీకాంత్ ( Srikanth ) కూడా ఊహ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శ్రీకాంత్ బిహేవియర్ చూసిన ఊహ తల్లిదండ్రులు ఓకే అన్నట్లు మొహం పెట్టారట.అలాగే అంత పెద్ద హీరో స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి శ్రీకాంత్ గురించి చెప్పడంతో ఊహ తల్లిదండ్రులు పూర్తిగా కన్విన్స్ అయ్యి శ్రీకాంత్ కి ఊహని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారట.

Advertisement

ఇలా వీరి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో సహాయం చేశారట.ఇక ఆ మధ్యకాలంలో శ్రీకాంత్ ఊహ విడాకులు తీసుకోబోతున్నారు అని ఒక వార్త నెట్టింట్లో వైరల్ అయినప్పటికీ దానికి చాలా ఘాటుగా స్పందించి ఇలాంటి వార్తలు ఇంకొకసారి వైరల్ చేస్తే రియాక్షన్ మరోలా ఉంటుంది అని శ్రీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

తాజా వార్తలు