టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కి తాను పోటీ అంటూ చెప్పుకునే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టపోయాడు.సినిమాపై నమ్మకంతో పెద్ద మొత్తంలో అన్ని ఏరియాల్లో కూడా హోల్ సేల్ గా ఈయన కొనుగోలు చేశాడు.
తీరా సినిమా విడుదలయ్యాక ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఈయనకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ సినిమా తో చాలా నష్టపోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఈ సమయం లోనే కొందరు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ అంటే దిల్ రాజు ను చూసి నేర్చుకోవాలని, ఆయన అనుసరించిన విధానాలను.
ఆయన యొక్క మార్గాలను అనుసరించాలంటూ సూచిస్తున్నారు.దిల్ రాజు సినిమా పై ఎంత నమ్మకం ఉన్నా కూడా మొత్తంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాడు.
ఆయన తన సినిమాని కూడా వేరే వాళ్లతోనే బిజినెస్ చేస్తాడు.
అలాంటి దిల్ రాజు కి పోటీ నేను అంటూ వరంగల్ శీను చెప్పుకొని ఇప్పుడు ఈ సినిమాతో బొక్క బోర్లా పడ్డాడని.
ఇప్పటికైనా ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి అంటూ వరంగల్ శ్రీనుకి కొందరు సలహా ఇస్తున్నారు.అయితే నిర్మాతగా దిల్ రాజు ఎన్నో సక్సెస్ లతో పాటు ఫ్లాప్ లను కూడా చవి చూశాడు.
అలాగే వరంగల్ శ్రీను మాత్రం చాలా సాహసంతో సినిమా పై నమ్మకంతో భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసి విడుదల చేశాడు.కానీ నిరాశ పర్చింది.అంత భారీ మొత్తం పెట్టి విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు.సినిమా అంటే అతనికున్న ప్రేమ అభిమానం కనిపిస్తుంది అంటూ మరి కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ సమయంలో ఆయనకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత హీరో విజయ్ దేవరకొండ కి మరియు దర్శకుడు కం నిర్మాత అయిన పూరి జగన్నాథ్ కి ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు ఆయన ఇలాంటి మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటూ ప్రోత్సాహం తప్పని సరి.మరి ప్రోత్సాహం దక్కుతుందా అనేది చూడాలి
.