సైతాను అనుచరులమంటూ... నర మాంసం తినాలనే కోరికతో... ఆ విద్యార్థులు .... వామ్మో !

తమ తోటి విద్యార్ధులను చంపి వారి నెత్తురు తాగి, మాంసం తినాలని కుట్ర పన్నిన ఇద్దరు విద్యార్ధినులను అమెరికా లోని సెంట్రల్‌ ఫ్లోరిడాలో అరెస్టు చేశారు.11, 12ఏళ్ళ వయస్సు కలిగిన ఈ విద్యార్ధినులు స్కూల్లోని వాష్‌రూమ్‌ వద్ద వేచి వున్నారని, లోపలకు వెళ్ళిన వారు బయటకు రాగానే వారిపై దాడి చేసేందుకు కత్తులను కూడా సిద్ధంగా ఉంచుకున్నారని అధికారులు వీల్లడించారు.

 Want To Kill Friends And Eat It Her Student Friends-TeluguStop.com

బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఆ విద్యార్ధినులపై హత్యకు కుట్ర, అక్రమంగా ఆయుధాలు కలిగి వుండడం, స్కూలు కార్యక్రమానికి ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు.తాము సైతాను అనుచరులమని ఆ విద్యార్ధినులు చెప్పుకుంటున్నారు.విద్యార్ధినులను హతమార్చిన తర్వాత తాము కూడా చనిపోవాలని వారు అనుకున్నారని అధికారులు తెలిపారు.స్కూల్లో యాజమాన్యం వీరి కదలికలు అనుమానాస్పదంగా వుండడంతో అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube