5జీ డేటా ఫ్రీగా కావాలా? అయితే కండీషన్స్ ఇవే!

ప్రముఖ మొబైల్ నెట్​వర్క్ కంపెనీ ఎయిర్​టెల్ ఇపుడు తన వినియోగదారుల కోసం అపరిమితంగా 5జీ డేటాను ఉచితంగా ఇస్తానంటోంది.అయితే దీని వెనకాల కొన్ని షరతులు వున్నాయండోయ్.

 Want Free 5g Data? But These Are The Conditions 5g, Interbet, Data, Free, Condi-TeluguStop.com

అర్హులైన యూజర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.ఇక 5జీ ప్లస్ నెట్​వర్క్ అనేది సాధారణ ఇంటర్నెట్​తో పోలిస్తే 30 రెట్లు వేగంగా ఉంటుంది.

అయితే అన్​లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా( 5G data ) అనేది కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ ఏం కాదు.ఇప్పటికే జియో వినియోగదారులకు ఈ వెసులుబాటు కలదు.

ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే యూజర్ల వద్ద కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాలి.ఆ తరువాత 5జీ ఫోన్( 5G phone )​లో ఎయిర్​టెల్ సిమ్ వేసుకొని తీరాలి.ఆ తర్వాత ఎయిర్​టెల్ థ్యాంక్స్( Airtel Thanks ) అయినటువంటి ‘మై ఎయిర్​టెల్ యాప్‘ డౌన్​లోడ్ చేసుకోవాలి.మై ఎయిర్​టెల్ సంస్థ తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యాప్ ఇది.అందులో ఖాతా వివరాలు, అమలులో ఉన్న ప్లాన్లు, డేటా వినియోగం వంటి సమాచారం ఉంటుంది.ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్​ స్టోర్​లో అందుబాటులో ఉంది.

నెలకు రూ.239 లేదా అంతకుమించిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికే ఈ ఉచిత ‘5జీ ప్లస్‘ డేటా లభిస్తుందని స్పష్టం చేయడం కొసమెరుపు.ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులిద్దరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.అయితే రూ.455, రూ.1799 ప్లాన్​లతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదని చాలా క్లియర్ కట్ గా ఎయిర్​టెల్ చెబుతోంది.ఇదే కాకుండా, మరో షాకింగ్ నిబంధన పెట్టింది.ఫ్రీ 5జీ డేటాను యూజర్లు తమ ఫోన్లలో మాత్రమే వినియోగించుకునేలా రూల్ కూడా ఒకటి పెట్టింది.పీసీకి కానీ, ల్యాప్​టాప్​కు కానీ అనుసంధానం చేసి డేటా షేర్ చేసుకోలేరని ఎయిర్​టెల్ వెల్లడించడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube