జీవితంలో తోడు కావాలి.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!

నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే.

బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈమె అనంతరం పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరు కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.

ఇలా పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ తన పిల్లలు ఆకీరా, ఆధ్యతో కలిసి పూణేలో నివసిస్తున్నారు.ఇలా పిల్లల సంరక్షణలో భాగంగా రేణు దేశాయ్ పిల్లలతో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఈ విధంగా ఈమె ఒంటరిగా గడుపుతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.గతంలో ఈమె ఒక వ్యక్తిని నిశ్చితార్థం చేసుకున్నారని అయితే తాను చేసుకోబోయే వ్యక్తికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచారనే వార్తలు వినిపించాయి.

ఇకపోతే ఈమె గతంలో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ అనంతరం పెళ్లి గురించి ఏ విధమైనటువంటి వార్తలు వెలువడ లేదు.అయితే తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈమె రెండో పెళ్లి గురించి మరోసారి చర్చలు మొదలయ్యేలా చేసింది.

Advertisement

ఈ సందర్భంగా రేణు దేశాయ్ సముద్రపు ఒడ్డున కూర్చున్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ.జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయిని పట్టుకొని నడిపించడం కోసం మనకు ఒక తోడు కావాలి అంటూ ఒక పోస్ట్ చేయడమే కాకుండా వెంటనే మరొక పోస్ట్ చేస్తూ.మీ సోల్ మేట్ ను వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి అంటూ ఈమె చేసిన ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని భావిస్తుందా అందుకే ఇలాంటి పోస్టులు చేసిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టుల వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు