మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.అయితే ఇన్నాళ్లు ఈ సినిమాని కేవలం చిరంజీవి సోలో సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు.
కానీ అసలు విషయం ఏంటంటే వాల్తేరు వీరయ్య పక్కా మల్టీస్టారర్ మూవీ.చిరుతో ఈక్వల్ గా రవితేజ పాత్ర ఉంటుందట.
దాదాపు సెకండ్ హాఫ్ 45 నిమిషాల పాటు రవితేజ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.సో అలా చూస్తే వాల్తేరు వీరయ్య సినిమా మల్టీస్టారర్ మూవీ అనే చెప్పొచ్చు.
చిరు, రవితేజ కలిసి అప్పట్లో అన్నయ్య సినిమా చేశారు.అయితే ఆ సినిమాలో చిరంజీవి మాత్రమే హీరో రవితేజ సైడ్ రోల్ అన్నట్టు డీల్ చేశారు.అప్పట్లో రవితేజ హీరోగా క్రేజ్ లేదు కాబట్టి అది నడిచింది.కానీ ఇప్పుడు రవితేజ మాస్ మహారాజ్ గా స్టార్ డం తెచ్చుకున్నాడు.
అందుకే సినిమాలో రవితేజ పాత్రకి బాగానే వెయిట్ ఇచ్చారట.అది సినిమాలో మాస్ రాజా ఫ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అయ్యేలా చేశారట.
మొత్తానికి వాల్తేరు వీరయ్య కేవలం చిరంజీవి సినిమాగా చెప్పుకోకుండా ఇది పక్కా మల్టీస్టారర్ మూవీ అని అనేస్తున్నారు ఆడియన్స్.