బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే 50 డేస్ సెంటర్ల విషయంలో ఈ సినిమాలు కొంతమేర నిరాశపరిచాయి.
అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించిన రికార్డ్ వాల్తేరు వీరయ్య సొంతమైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.వాల్తేరు వీరయ్య అరుదైన ఘనతను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
దాదాపుగా 100 సెంటర్లలో వాల్తేరు వీరయ్య 50 రోజుల పాటు ప్రదర్శించబడుతోందని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శించబడిన సినిమా వాల్తేరు వీరయ్య మాత్రమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సెంటర్లలో కొన్ని డైరెక్ట్ సెంటర్లు కాగా మరికొన్ని సెంటర్లు షిప్ట్ లతో నడుస్తున్నాయి.ప్రముఖ సెంటర్లలో వాల్తేరు వీరయ్య 50 రోజుల పాటు ప్రదర్శించబడటం అంటే ఇది అరుదైన ఘనత అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చిరంజీవి స్టామినాకు ఇదే నిదర్శనం అని మెగాస్టార్ మూవీ అంటే ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ కావాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సంక్రాంతి సినిమాలలో ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న ఏకైక సినిమా వాల్తేరు వీరయ్య కావడం గమనార్హం.వాల్తేరు వీరయ్య మూవీ కథ మరీ కొత్త కథ అయితే కాదు.అయితే ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ శృతి హాసన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.చిరంజీవి 67 సంవత్సరాల వయస్సులో కూడా నటుడిగా సత్తా చాటుతున్నారు.గొప్ప నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.







