అప్పుడే రికార్డుల వేట షురూ.. ప్రీ సేల్స్ తో అదరగొడుతున్న 'వీరయ్య'!

మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.ఈ సినిమా మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు సిద్ధం అవుతుంది… 2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

 Waltair Veerayya Earns 100k Dollars From Advance Sales Details, Waltair Veerayya-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే రాక్ స్టార్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది.రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు మరో 10 రోజులు కూడా లేకపోవడంతో మిగతా కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తున్నారు.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు.ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిముషాలు ఉంటుంది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ సేల్స్ ఇప్పటికే యూఎస్ లో షురూ అయ్యాయట.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్కడ 100K కి పైగానే అడ్వాన్స్ సేల్స్ అయినట్టు టాక్ వస్తుంది.రిలీజ్ దగ్గర పడేకొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరగడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube