బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించే వాల్న‌ట్ ఆయిల్‌..ఎలా తీసుకోవాలంటే?

బెల్లీ ఫ్యాట్‌.ఇటీవ‌ల కాలంలో చాలా మందిని కామ‌న్‌గా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ముందుంటుంది.

శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల బెల్లీ ఫ్యాట్‌ ఏర్ప‌డుతుంది.ముఖ్యంగా అమ్మాయిల్లో బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య అత్య‌ధికంగా క‌నిపిస్తోంది.

దీంతో బాన పొట్టను ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క‌.దాచోకోలేక నానా తంటాలు ప‌డుతుంటారు.

అయితే బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.అలాంటి వాటిలో వాల్న‌ట్ ఆయిల్ కూడా ఒక‌టి.

Advertisement
Walnut Oil To Reduce Belly Fat Easily-బెల్లీ ఫ్యాట్‌�

సాధార‌ణంగా వాల్ న‌ట్స్‌ ఆరోగ్యానికి మంచివ‌ని అంద‌రికీ తెలుసు.అయితే వాల్ న‌ట్స్‌తో త‌యారు చేసే వాల్న‌ట్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ముఖ్యంగా వాల్న‌ట్ ఆయిల్ తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొట్ట మ‌రియు ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకు పోయి ఉన్న కొవ్వును క‌రిగించేస్తోంది.

దాంతో సుల‌భంగా బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య దూరం అవుతుంది.

Walnut Oil To Reduce Belly Fat Easily

వాల్న‌ట్ ఆయిల్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే మ‌తి మ‌రుపుతో బాధ ప‌డే వారు, ఆలోచా శ‌క్తిని పెంచుకోవాలి అని భావించే వారు వాల్న‌ట్ ఆయిల్ తీసుకోవ‌డం చాలా మంది.వాల్న‌ట్ ఆయిల్‌లో ఉంటే ప‌లు పోష‌కాలు మెద‌డు వేగంగా ప‌ని చేసేలా చేస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

జ్ఞాప‌క‌శ‌క్తిని కూడా రెట్టింపు చేస్తాయి.అయితే వాల్న‌ట్ ఆయిల్‌ను వంట‌ల్లో వాడితే చేదు రుచి ఉంటుంది.

Advertisement

ఇలా చేదుగా ఉంటే మీరు అస్స‌లు తినలేరు.‌కాబ‌ట్టి, వాల్న‌ట్ ఆయిల్‌ను స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌డం మంచిద‌ని అంటున్నారు నిపుణులు.

ఇక చ‌ర్మ ఆరోగ్యాన్ని పెంచ‌డంలోనూ వాల్న‌ట్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖానికి వాల్న‌ట్ ఆయిల్‌ను అప్లై చేస్తే ముడ‌త‌లు, మొటిమ‌లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, క‌ళ్ల కింద వ‌ల‌యాలు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

తాజా వార్తలు