తాజాగా ఆయన వ్యాఖ్యలు చూస్తే మార్గదర్శి ( Margadarsi )వ్యవహారంలో జనసేన నేతల వ్యవహార శైలి తో ఆయన ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది .రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని తాను బలంగా కోరుకున్నానని .
బలమైన ఆలోచనలు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన విధానం కలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఎన్నికలలో నిలదొక్కుకోవడానికి అవసరమైన కొన్ని సలహాలను కూడా పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలని అనుకున్నానని అయితే ఆయన రెండు చోట్ల ఓడిపోవడంతో ఆలోచన ముందుకు పోలేదని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్( Pawan kalyan ) సీఎం అవుతాడో లేదో తనకు తెలియదు కానీ మంచి నాయకుడు మాత్రం అవుతాడని భావించానని తన పట్ల కూడా పవన్ అంతే అభిమానం చూపిస్తారని ,గౌరవ మర్యాదలు ఇస్తారని .మార్గదర్శి వ్యవహారంలో రామోజీ రావు గారి( Ramoji Rao )కి మద్దతుగా మాట్లాడడం తనను కొంత ఆశ్చర్యపరిచిందని ఆయన చెప్పుకొచ్చారు.బహుశా వైసిపి పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశంతో వాళ్లు మార్గదర్శకి మద్దతు ఇచ్చి ఉండవచ్చు కానీ అంతకుమించి రామోజీ పట్ల వాళ్ళకు ప్రత్యేక అభిమానం ఉందని తనకు అనిపించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు .

ఎన్నికలలో అధికారం పట్ల ప్రేమ తప్ప భాజపాకి ఏపీ పై ఎలాంటి ఆసక్తి లేదని, రెండు పార్టీలను ఒకేలా చూస్తుందని వచ్చే ఎన్నికలలో బాజాపా ఒంటరిగా పోటీ చేసే వాతావరణమే కనిపిస్తుందని, ఒకవేళ జనసేన ఆసక్తి చూపిస్తే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయవచ్చేమో కానీ టిడిపి తో కలిసి వెళ్తుంది అని తనకు అనిపించడం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు .

తన పట్ల గౌరవం మర్యాదలు కలిగిన జనసేన పార్టీ మార్గదర్శి వ్యవహారంలో యూటర్న్ తీసుకోవడం పట్ల ఆయన కొంత హర్ట్ అయినట్టుగా ఆయన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది.పవన్ కు సలహాలు కూడా ఇవ్వాలని అనుకున్నాను అని ఆయన చెప్పడంతో జనసేన పార్టీ భవిష్యత్తుపై ఆయన పెద్ద అంచనాలతోనే ఉన్నారని తెలుస్తుంది.ఇప్పుడు ఇలా బయటపడడంతో బహుశా జనసేనలో ఈయన క్రియాశీలక పాత్ర పోషిస్తారనే అంచనాలు కూడా మొదలయ్యాయి .







