Vu TV: వీయూ టీవీ ప్రీమియం మార్కెట్లోకి వచ్చేసిందోచ్… ధర, ఫీచర్లు ఇవే!

టెలివిజన్ మార్కెట్లోనే తక్కువ ధరల్లో అద్భుతమైన ఫీచర్లను టీవీలు అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న ప్రముఖ టీవీ బ్రాండ్ అయినటువంటి వీయూ టెలివిజన్స్ ఇపుడు ఇండియన్ మార్కెట్లోకి తన కొత్త ప్రీమియం టీవీ 23( Vu TV ) ఎడిషన్‌ ను లాంచ్ చేసింది.ఈ కొత్త 4కె టీవీలు 43-అంగుళాలు, 55-అంగుళాల డిస్‌ప్లే సైజులలో ఇపుడు అందుబాటులో వున్నాయి.

 Vu Tv Vu Tv Comes To The Premium Market The Price And Features Are The Same-TeluguStop.com

డిస్‌ప్లే సైజులు పెద్దవే అయినప్పటికీ రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉండడం గమనార్హం.ఈ ఎడిషన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా భారతదేశ వ్యాప్తంగా రిటైల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Telugu Cost, Ups, Vu Premium, Vu Tv-Latest News - Telugu

ఈ ప్రీమియం టీవీ ఫీచర్ల విషయానికొస్తే… 43-అంగుళాలు, 55-అంగుళాల సైజుల్లో అందుబాటులో వున్నాయి.43 అంగుళాల మోడల్ ధర రూ.23,999గా ఉంటే, 55 అంగుళాల మోడల్ ధరను రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది.టీవీ నాలుగు వైపులా ఫ్రేమ్‌లెస్ అంచులతో నాజుకైన డిజైన్‌ కలిగి ఉండడం గమనించవచ్చు.4కె హై-క్వాలిటీ డిస్‌ప్లే రిజల్యూషన్‌ స్క్రీన్‌ ఉండడం విశేషం.ఇమేజ్‌లు మెరుగ్గా కనిపించేలా చేసే ఏఐ పిక్చర్ బూస్టర్‌ కలదు.అలానే హెచ్ డి ఆర్ 10తో హై-క్వాలిటీ వీడియోను ప్లే చేస్తుంది.ఇక 43-అంగుళాలు, 55-అంగుళాల మోడల్స్‌ డిజిటల్ నాయిస్ రెడక్షన్‌తో వస్తాయి.

Telugu Cost, Ups, Vu Premium, Vu Tv-Latest News - Telugu

ఇక టీవీల ఆడియో విషయానికి వస్తే.వీటిలో సౌండ్‌బార్‌తో కూడిన లౌడ్ సౌండ్ సిస్టమ్( Loud sound system ) కలదు.50W సౌండ్ ఔట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేసే 2 పెద్ద స్పీకర్లు, 2 ట్వీటర్లు కలవు.విభిన్న మోడ్‌లతో డాల్బీ ఆడియో, సరౌండ్ సౌండ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.ఈ కొత్త వియు టీవీ గూగుల్ టీవీ OSని ఉపయోగిస్తుంది.ఈ ఓఎస్ ప్లే స్టోర్ ద్వారా వివిధ రకాల యాప్‌లు, ప్రముఖ ఓట్ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.3 హెచ్ డి ఎం ఐ పోర్ట్‌లు, 2 యూ యస్ బి పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, వై-ఫై 802.11 ఏసి, ఏవీ ఇన్‌పుట్, ఈథర్‌నెట్ ఉన్నాయి.ఇంకా గూగుల్ అసిస్టెంట్‌( Google Assistant )కి యాక్సెస్‌ను అందిస్తుంది.

ఈ టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్లు వున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube