వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే.
మహిళా అక్రమ రవాణాలకు వాలంటీర్లు పాల్పడుతున్నారని ఆరోపించడం జరిగింది.
దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కి నోటీసులు కూడా పంపించడం జరిగింది.
అయితే ఇదే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో జనసేన నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి.తాజాగా విజయవాడలో పనిచేస్తున్న వీఆర్వో బాలమ్మ( VRO Balamma ) ఏకంగా 34 మంది జనసేన నాయకులపై పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది.
రోడ్డుపై ధర్నా చేసి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో బాలమ్మ ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు.జనసేన( Janasena ) నాయకులపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ పరిణామంతో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతారా.? ఎన్ని కేసులు పెట్టిన వెనకడుగు వేయమని జనసేన నేతలు అంటున్నారు.వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోత్తిన వెంకట మహేష్.ఆధ్వర్యంలో చిట్టి నగర్ సెంటర్ లో ఆందోళనలు చేస్తూ ఉండటంతో వారిపై వీఆర్వో బాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy