2019 ఎన్నికలలో 151 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసి అధికారం లోకి వచ్చిన వైసీపీ పార్టీ( YCP party ) , ప్రస్తుతం దయనీయమైన పరిస్థితికి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే.నాలుగేళ్లలో ఈ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనేది చాలా అరుదుగా జరగడం మనం చూసాము.
అప్పుడెప్పుడో 2004 కి ముందు తెలుగు దేశం పార్టీ పై ఇలాంటి వ్యతిరేకత ఏర్పడింది.మళ్ళీ ఇన్ని ఏళ్లకు ఆ స్థాయి వ్యతిరేకతని ఏర్పాటు చేసుకున్నాడు వైసీపీ ప్రభుత్వమే అని చెప్పొచ్చు.
గత ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) కి 23 స్థానాలు రాగా, జనసేన పార్టీ ( Janasena party )కి ఒక్క స్థానం వచ్చింది.ఈ ఎన్నికలలో తెలుగు దేశం కి గతం లో వచ్చిన 23 స్థానాలు, వైసీపీ కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ – జనసేన కూటమి సరిగ్గా ప్లానింగ్ ప్రకారం పోతే జరిగేది ఇదేనట.

ఇది ఇలా ఉండగా ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ ( YS Jagan )సొంత స్థానం లో పులివెందుల లో కూడా ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.ఎంఎల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పొందడం అందుకు ఒక ఉదాహరణ అని అంటున్నారు.దీనిని బట్టీ చూస్తుంటే వైసీపీ పార్టీ కి చదువుకున్న స్టూడెంట్స్ లో, అలాగే ప్రభుత్వ ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయం తెలుస్తుంది.
కేవలం రెడ్డి సామజిక వర్గం మరియు మైనారిటీ ఓట్లు తప్ప, పులివెందుల లో అన్నీ వర్గాల ఓట్లు జగన్ కి పడడం అంత తేలికైన విషయం కాదని తెలుస్తుంది.కచ్చితంగా జగన్ తన స్థానం లో గెలుస్తాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు.
కానీ ఇన్ని సంవత్సరాలు మైంటైన్ చేస్తూ వచ్చిన మెజారిటీ మాత్రం ఈసారి కష్టమే అని అంటున్నారు.ఇదే జగన్ కి వార్నింగ్ బెల్ లాంటిది కూడా అని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.

మరి జగన్ విశ్లేషకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.మరో పక్క వైసీపీ నాయకులు బస్సు యాత్ర ని కొనసాగిస్తూనే ఉన్నారు, ఈ యాత్ర కి జనాలు కరువయ్యారు, దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, జనాలు ఏ స్థాయిలో ప్రభుత్వం పై కోపం చూపిస్తున్నారు అనేది.ఇక పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ , అలాగే నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్ర తిరిగి ప్రారంభం అయితే వైసీపీ పై మరింత నెగటివిటీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.