ఓటరు మహాశయా...! నీ చిరునామా ఎక్కడ ? 

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలకు ఓటర్లు దేవుళ్ళుగా కనిపిస్తారు.వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు.

 Voter Mahashaya Where Is Your Address ,voters, Telangana, Trs, Bandi Sanjay, Mu-TeluguStop.com

ఓటర్ల అనుగ్రహం ఉంటే తప్ప తాము గెలవలేము అనే ఉద్దేశంతో ఇంతగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తంటాలు పడుతూ ఉంటాయి.వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు.

ప్రస్తుతం తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది .

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది.వచ్చే నెల మూడో తేదీన పోలింగ్ జరగబోతోంది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్ అయ్యాయి.ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగి నేరుగా ఓటర్లను కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో,  ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కీలక నాయకులందరినీ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే మోహరించి మండలాలు గ్రామాల వారీగా ఇన్చార్జిలుగా అన్ని పార్టీలు నియమించాయి.ఎన్నికలు ముగిసే వరకు అన్ని పార్టీలకు చెందిన కీలక నాయకులంతా ఈ నియోజకవర్గంలోని మకాం వేయనున్నారు.

  ఇదిలా ఉంటే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లు ఎంతమంది ? ప్రస్తుతం వారిలో ఎంతమంది స్థానికంగా అందుబాటులో ఉన్నారు ? వారి వివరాలు ఏంటి ? అలాగే ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎంతమంది ? వారిలో ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు ?  వారి చిరునామాలు ఏంటి ఇలా అన్నిటిని రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి.ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి అలర్ట్ గా ఉంది.

వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఆరా తీస్తోంది.మునుగోడు నుంచి వలస వెళ్లిన ఓటర్ల లో  చాలామంది ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టుగా గుర్తించింది.

దీంతో వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవలసిందిగా పార్టీ శ్రేణులకు తెలంగాణ బిజెపి నుంచి ఆదేశాలు వెళ్లాయి.వచ్చే నెల మూడో తేదీన వారు ఓటు వేసేందుకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసే పనులు బిజెపి నిమగ్నమైంది.

 

ఈ మేరకు స్థానిక నాయకులను అలెర్ట్ చేస్తూ వారిని బిజెపి వైపు మొగ్గు చూపే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిజెపి కార్పొరేటర్లు ఇతర కీలక నాయకులకు మునుగోడు నుంచి వలస వెళ్లిన వారి జాబితాను అందించి,  వారిని ప్రసన్నం చేసుకునే బాధ్యతలను బిజెపి రాష్ట్ర నాయకత్వం అప్పగించిందట.అలాగే  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధమైన వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే విషయంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని ఈ రోజు నిర్వహించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube