బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం .బిజెపి మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ మీడియా పాయింట్స్ .
వాలంటీర్లు వైసీపి కార్యకర్తలే అని హోమంత్రి ప్రకటించారు వాలంటీర్లు వైసీపి ఇంటిలెజెన్స్ వ్యవస్ధలా కొనసాగుతోంది వైసీపి కి ఒక గూడచారి విభాగమా.ఇప్పటి వరకు బిజెపి చెప్పిన విషయాన్ని హోమంత్రి ద్రువీకరించారువాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చే నగదు తీసుకుని వైసీపి కార్యకర్తల్లా పని చేయడాన్ని బిజెపి ప్రశ్నించదలచుకుందిముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి లేదంటే బిజెపి పోరాటం చేయాల్సి వస్తుంది.
తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపి విజయం కోసం రోడ్డెక్కారు ఆత్మకూరులో బిజెపి నాయకులు పట్టుకుంటే వాలంటీరు మీద చర్య తీసుకోకుండా బిజెపి పై కేసులు నమోదు చేశారు.బిజెపి తరపున ఆత్మకూరు ఎన్నికల్లో ఏజెంట్ గా పని చేసిన పద్మ అనే కార్యకర్తను వైసీపి నేత ఇంటికి పిలిచి పద్మ పై దాడి చేశారు పద్మ పై దాడి చేసిన నాయకులపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలి ఇప్పటికే మారాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గారు కూడా స్పందించారని మీడియా కు గుర్తు చేశారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులు సమావేశం నిర్వహించిన బిజెపి నాయకుల పై పట్టపగలు మారణాయుధాలతో దాడి చేశారు ఈ కేసులో వైసీపి నేతలను ఎందుకు అరెస్టు చేయలేదు ఎమ్మెల్యే ప్రోద్భలంతో నే ఈ దాడులు జరిగాయనేది స్పష్టం గా తెలుస్తోంది ప్రభుత్వం యంత్రాంగం అంతా పార్టీ కోసం పనిచేస్తోంది ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకంగా మారింది.వైసీపి నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే వారి లక్ష్యంగా కనపడుతోంది వీటన్నంటికీ కూడా సమాధానం చెబుతాం
ఉండి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరిలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు భీమవరం వస్తున్న ప్రధాన మంత్రి మోదీ సభలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు అంటే హింసను ప్రేరేపిస్తు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే పండుల రవీంద్రబాబును అరెస్టు చేయాలి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి విగ్రహావిష్కరణ కు వస్తున్న భారత ప్రధాని ముందు నిరసన తెలియచేయాలని పిలుపు ఇచ్చారంటే అది పార్టీ పిలుపా లేదా ఆయన వ్యక్తి గత వ్యాఖ్యాలా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలి .వైసీపి ఎమ్మెల్సీని వెంటనే ముందస్తు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రవీంద్రబాబు వ్యాఖ్యలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలి.ఈ విషయంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి రవీంద్రబాబు ఎమ్మెల్సీగా ఉండే అర్హత కూడా లేదని యామినీ శర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు.