ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవాలని చాలామందికి ఉంటుంది.దీని కోసం చాలామంది సాహసాలు, విన్యాసాలు చేస్తూ ఉంటారు.
ఇక వ్యక్తులతో పాటు వస్తువులు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కుతూ ఉంటాయి.ఇండియాలో ఏదైనా రంగంలో నెంబర్ వన్ సాధించిన వ్యక్తులు లేదా వస్తువులను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిస్తూ ఉంటారు.
ఎప్పటికప్పుడు వీటిని అప్డేట్ చేస్తూ ఉంటారు.చాలామంది వ్యక్తులు కూడా తమ రంగంలో ప్రతిభ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.
అయితే తాజాగా ఒక కారు ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.ఫోక్స్‌వ్యాగన్ తాజాగా వర్చు కారు విడుదల చేసింది.ఈ కారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం.ఇండియాలోనే ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఘనతను ఈ కారు సాధించింది.
ఎక్కువ డెలివరీలు చేసిన కారుగా ఈ కారు రికార్డు నెలకొల్పింది.దీని కోసం మెగా డెలివరీ అనే ప్రొగ్రాంను ఫోక్స్ వ్యాగన్ సంస్థ చేపట్టింది.
ఈ ప్రొగ్రాం ద్వారా అత్యధిక డెలివరీలు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.దీని కోసం డీలర్లందరికీ ఫోక్స్ వ్యాగన్ సంస్థ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో కేరళకు చెందిన ఈవీఎం మోటార్స్ అండ్ వెహికల్స్ అనే డీలర్ రికార్డు సృష్టించాడు.

ఒకే రోజులో 150 సెడాన్ కార్లు డెలివరీ చేసి రికార్డు నెలకొల్పాడు.ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడూ ఇలా ఒక డీలర్ నుంచి అత్యధిక స్థాయిలో సెడాన్ కార్డు డెలివరీ కాలేదు.దీంతో ఇదే రికార్డుగా నిలిచింది.
జూన్ 9న కారును మార్కెట్ లో రిలీజ్ చేయగా.అదే రోజు అత్యధిక డెలివరీలు చేసి రికార్డు నెలకొల్పాడు.
దీంతో ఈ కారుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.ఇప్పటివరకు ఈవీఎం డీలర్లు 200 వరకు వర్సుస్ కార్లను డెలివరీ చేశారు.అయితే దీని ప్రారంభ ధర రూ.11.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.