వొడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్.. రూ.17కే అన్‌లిమిటెడ్ డేటా!!

వొడాఫోన్ ఐడియా (Vi)( Vodafone Idea ) భారతదేశంలోని తన కస్టమర్ల కోసం 7 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తాజాగా ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్లను ప్రత్యేకంగా 4G యూజర్ల కోసం పరిచయం చేసింది.ఇవి విభిన్న ఫీచర్లు, ప్రయోజనాలతో వస్తాయి.

 Vodafone Idea Offers Unlimited Data For Rs 17!! Vodafone Idea, Vi New Prepaid Pl-TeluguStop.com

1.కొత్తగా ప్రకటించిన ప్లాన్‌లలో ఒకదాని ధర రూ.1,999.ఇది 250 రోజుల వాలిడిటీతో వస్తుంది.రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

Telugu Cheap Prepaid, Tech, Vi Prepaid, Vodafone Idea-Technology Telugu

2.రూ.198 ధర కలిగిన మరో ప్లాన్ ముంబైలో మాత్రమే అందుబాటులో ఉంది.ఇది 30 రోజుల వరకు వాలిడిటీతో వస్తుంది.ఇది రూ.198 విలువైన టాక్ టైమ్, 500MB డేటాను అందిస్తుంది.

3.ముంబై యూజర్లకు ప్రత్యేకమైన రూ.204 ధరతో ఇదే విధమైన ప్లాన్ కూడా ఉంది.ఇది రూ.204 పరిమిత టాక్ టైమ్, ఒక నెలపాటు 500MB డేటాను అందిస్తుంది.ఈ రెండు ప్లాన్‌లు సెకనుకు 2.5 పైసల చొప్పున వినియోగదారుల నుంచి మనీ వసూలు చేస్తాయి.

Telugu Cheap Prepaid, Tech, Vi Prepaid, Vodafone Idea-Technology Telugu

4.Vi రూ.224, రూ.232 ధరలతో మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు( Prepaid plans ) తీసుకొచ్చింది, ఇవి ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఈ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, నెలకు 4GB డేటాతో వస్తాయి.అయితే, SMS ప్రయోజనాలు ఏవీ ఉండవు.

5.ఇక దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం Vi రూ.17 ధరతో ఓ అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇది ఒక రోజు వాలిడిటీ కలిగి ఉంటుంది.ఇది 12 am – 6 am మధ్య అన్‌లిమిటెడ్ నైట్ డేటాను ఆఫర్ చేస్తుంది.

6.రూ.57 ధరతో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ పరిచయం చేసింది.ఇది 7 రోజుల వాలిడిటీతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.ఇది 12 am – 6 am మధ్య అన్‌లిమిటెడ్ నైట్ డేటాను ఆఫర్ చేస్తుంది.

ఈ ప్లాన్లు Vi కస్టమర్ బేస్‌ను నిలుపుకోవడానికి,

ఇతర టెలికాం కంపెనీలకు అందుబాటులో లేని అన్‌లిమిటెడ్ నైట్ డేటా( Unlimited night data ) వంటి ప్రత్యేక ఫీచర్లను అందించడానికి తీసుకురావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube