ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ బ్యాన్.. ఎందుకంటే..?

చైనా దేశానికి చెందిన పబ్‌జీ మొబైల్‌, టిక్‌టాక్‌, కామ్‌స్కానర్‌ తో పాటు వందల సంఖ్యలో యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.ఈ యాప్‌లు భారతీయ యూజర్ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయనే అనుమానంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

 Vlc Media Player Banned In India.. Because Vlc, Media Player, Banned, India, Tec-TeluguStop.com

అయితే చైనీస్ యాప్, సాఫ్ట్‌వేర్ కాని ప్రముఖ మీడియా ప్లేయర్ వీఎల్‌సీని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.ఈ బ్యాన్ విధించి ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ను ఇండియా బ్యాన్‌ చేసినట్టు స్వయానా వీఎల్‌సీ ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ తెలిపింది.కాకపోతే ఈ బ్యాన్ అనేది సాఫ్ట్‌ బ్యాన్ కాబట్టి ఎవరికీ తెలియలేదు.

దీనిని ప్రభుత్వం బ్యాన్‌ చేయడానికి ఒక కారణం ఉంది.అది ఏంటంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా మద్దతుగల సైబర్ దాడులలో భాగంగా హానికరమైన మాల్వేర్ లోడ్‌ను పీసీలలో పంపించడానికి సికాడా అనే హ్యాకింగ్ టీం వీఎల్‌సీ ప్లేయర్‌ను ఉపయోగించింది.

ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.దీంతో ప్రభుత్వం వీఎల్‌సీ అఫీసియల్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌ను ఇండియాలో ఎవరు యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేసింది.

ప్రస్తుతానికి ఈ లింక్స్ మాత్రమే పనిచేయడం లేదు.గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీనిని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే ఇండియాలో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ వెబ్‌సైట్, డౌన్‌లోడ్ లింక్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు… “ఐటీ చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని బ్యాన్ చేయడం జరిగింది” అని కనిపిస్తోంది.అంటే మీరు వీటిని ఇకపై యాక్సెస్ చేయలేరన్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube