స్టీల్ ప్లాంట్ రాజకీయం !  విశాఖలో బీఆర్ఎస్ సభ ఫిక్స్ 

దేశమంతా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఏపీ లోను( CM kcr ) పాగా వేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఏపీలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా.

 Vizag Steel Plant Politics! Brs Meetings Fix In Visakhapatnam , Thota Chandrase-TeluguStop.com

అది సాధ్యం కావడం లేదు.ఇప్పటికే మహారాష్ట్రలో రెండుసార్లు సభ నిర్వహించారు.

అదేవిధంగా ఏపీలోనూ తమకు మంచి రాజకీయ అనుకూలత ఉందని భావిస్తున్న కెసిఆర్ ఏపీలో సభ నిర్వహించేందుకు అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పుడు ఆ అనుకూలమైన పరిస్థితులు రానే వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ( Vizag steel plant ) వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరిన నేపథ్యంలో,  మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.

ఇక ఈ అంశం ద్వారానే రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ పెద్దలు , ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ఆదేశించారట.

Telugu Brs, Telangana, Vizag Steel-Politics

ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ఏపీలో నిర్వహించాలని చూసినా,  పరిస్థితులు అనుకూలించకపోవడంతో మహారాష్ట్రలో రెండుసార్లు సభను నిర్వహించారు .  ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతుతో పాటు,  ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ పట్టు సాధించవచ్చనే వ్యూహంతో కేసిఆర్ ఉన్నారట.

Telugu Brs, Telangana, Vizag Steel-Politics

 ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్( Thota Chandrasekhar ) తో పాటు,  మరికొంతమంది కీలక నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది.  ఈ నెలలోనే బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే తేదీ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube