అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి( Indian-origin Vivek Ramaswamy ) తన ప్రచారంలో దూసుకుపోతున్నారు.ర్యాలీలు, ఫండ్ రైజింగ్, డిబేట్‌లను నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు.
అక్కడి ఎన్నికల సరళి, ఎవరు ముందంజలో వున్నారనే దానిపై పలు ఏజెన్సీలు సర్వేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఎమర్సన్ కాలేజీ పోల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులుగా నిలిచిన డిసాంటిస్, రామస్వామిలు పది శాతం చొప్పున సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతంతో రిపబ్లికన్‌లలో అందరికంటే టాప్‌లో నిలిచారు.ఈ మేరకు ది హిల్ నివేదించింది.

జూన్‌లో 21 శాతం ప్రజా మద్ధతుతో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన డిసాంటిస్( DeSantis ) తాజా ఎమర్సన్ కాలేజ్ పోల్ ప్రకారం 10 శాతానికి పడిపోవడం గమనార్హం.మరోవైపు రామస్వామి 2 శాతం నుంచి ఏకంగా డిసాంటిస్‌తో సమానంగా నిలవడం విశేషం.రామస్వామి మద్ధతుదారులలో సగం మంది ఖచ్చితంగా ఆయనకు ఓటు వేస్తారని సర్వే తెలిపింది.అయితే డిసాంటిస్ మద్ధతుదారులలో మూడింట ఒక వంతు మాత్రమే ఓటింగ్‌కు అనుకూలంగా వున్నట్లు చెప్పారని ది హిల్ పేర్కొంది.

ఇదిలావుండగా.80 శాతానికి పైగా ట్రంప్ మద్ధతుదారులు తాము ఖచ్చితంగా మాజీ అధ్యక్షుడికి ఓటు వేస్తామని తెలిపారు.రామస్వామి ద్వితీయ స్థానానికి చేరుకున్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా.ఇదే సమయంలో ఫ్లోరిడా గవర్నర్ వెనుక మరికొందరు రిపబ్లికన్లు అభ్యర్ధులు కూడా పుంజుకుంటున్నట్లుగా సర్వే అంచనా వేసింది.
ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబాల్( Spencer Kimball ) ఒక ప్రకటనలో మాట్లాడుతూ.రామస్వామి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో ఓటర్లలో మెరుగుదల పొందారని తెలిపారు.
పీజీ విభాగంలో 17 శాతం మందిని, యువ ఓటర్ల విభాగంలో 35 ఏళ్లలోపు వారిలో 16 శాతం మందిని ఆయన ఆకట్టుకున్నారని ది హిల్ నివేదించింది.అటు డిసాంటిస్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్ల విభాగంలో జూన్ నెలకు గాను 38 శాతంగా వున్న ఆయన మద్ధతు ఇప్పుడు 14 శాతానికి పడిపోయింది.35 ఏళ్లలోపు వారిలో 15 శాతం మంది మాత్రమే డిసాంటిస్‌కు మద్ధతుగా నిలుస్తున్నారని ది హిల్ తెలిపింది.







