న్యూయార్క్ వీధుల్లో కొలంబియా వలసదారులతో వివేక్ రామస్వామి ముచ్చట్లు.. వ్యూహం వుందా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ( Republican Party )అభ్యర్ధిత్వం కోసం పోటీపడిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే.మధ్యలో ట్రంప్‌తో కలిసి కనిపించగా.

 Vivek Ramaswamy Meets Columbian Immigrant On Nyc Street, Here's What Happened Ne-TeluguStop.com

ఆయనను వైస్ ప్రెసిడెంట్‌గా తీసుకుంటారా అన్న ప్రచారం జరిగింది.ఆ తర్వాత మీడియాలో వివేక్ సందడి లేదు.

ఈ క్రమంలో న్యూయార్క్( New York ) వీధుల్లో రామస్వామి ప్రత్యక్షమయ్యారు.కొలంబియాకు చెందిన వలసదారులతో ఆయన ముచ్చటించారు.

ఈ మేరకు ఓ వీడియోను వివేక్ పంచుకున్నారు.కొలంబియన్ వలసదారుడు, అక్రమ వలసదారులు దేశంలో దర్జాగా నడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

వారు కొలంబియా, పెరూ, వెనిజులాలలో నేరాలను చేసిన వారని వివేక్ అన్నారు.నేరస్తులను ఈ దేశానికి ఎగుమతి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాము అలా చేయకుండా చూసుకుంటామని.ఎందుకంటే అదే నా కర్తవ్యమన్నారు.

అంతకుముందు అమెరికాలో అక్రమ వలసలకు రామస్వామి పరిష్కారాన్ని ప్రతిపాదించారు.సరిహద్దు ఉల్లంఘించేవారిని అమెరికాలోకి ప్రవేశించకుండా వ్యతిరేకించాలని , దేశాన్ని వాక్ ఇన్ విధానం నుంచి రక్షించడానికి మిలిటరిని ఉపయోగించాలని, ఇమ్మిగ్రేషన్ రెగ్యులేషన్ చట్టం కోసం నిలబడాలని వివేక్ రామస్వామి పిలుపునిచ్చారు.ఇది చట్టపరమైన మార్గాలను ముందస్తుగా విధించింది.బహిష్కరణలు, నిధుల తొలగింపు, అక్రమ వలసదారులకు జన్మించిన పిల్లలను పౌరులుగా అంగీకరించడానికి నిరాకరించడం వంటి ఆయన చేసిన ప్రతిపాదనలు ఆందోళన కలిగించాయి.

ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టుల( Engineers, scientists, journalists ) వంటి నిపుణులకు 5 దశల దరఖాస్తు ప్రక్రియల ద్వారా వారి వీసాలను ఆమోదించడానికి సాధారణంగా 500 రోజులకు పైగా సమయం పడుతుంది.కొన్నిసార్లు 100 ఏళ్లకు మించి వేచి వుండాల్సి వస్తుందని .కానీ కొందరు వ్యక్తులు మాత్రం దేశంలో అడుగుపెట్టడానికి ఓపెన్ బోర్డర్ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube