టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ( Vithika Sheru )వరుణ్ సందేశ్ స్థాయిలో కాకపోయినా తనకంటూ ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.తాజాగా వితికా షేరు తన ఆరోగ్య సమస్యల గురించి నెటిజన్లతో పంచుకోగా అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తక్కువ సినిమాలలో నటించిన వితిక బిగ్ బాస్ షో ( Bigg Boss Show )ద్వారా ఊహించని స్థాయిలో నెగిటివిటీ మూటగట్టుకున్నారు.
నాకు మైగ్రేన్ వ్యాధితో పాటు స్పాండిలైటిస్ ఉందని వితిక చెప్పుకొచ్చారు.
మైగ్రేన్ ( Migraine )వల్ల విపరీతమైన తలనొప్పి వస్తోందని అదే సమయంలో మెడ నొప్పి వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నానని వితికా షేరు పేర్కొన్నారు. స్పాండిలైటిస్ వ్యాధికి( spondylitis ) కూడా నేను ఫిజియోథెరపీ చేయించుకున్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.
కొన్నిరోజుల క్రితం నేను నీడ్లింగ్ చేయించుకున్నానని వితికా షేరు అన్నారు.
నీడ్లింగ్ చికిత్స ( Needling treatment )తర్వాత నా పనులను నేను సులువుగా చేసుకోగలిగానని వితికా షేరు వెల్లడించారు.ఒత్తిడి వల్ల నెల రోజుల నుంచి మెడనొప్పి మరింత తీవ్రంగా మారిందని ఆమె తెలిపారు.ఆ నొప్పిని నేను భరించలేకపోతున్నానని వితికా షేరు అన్నారు.
రెండు వారాల క్రితం నాకు మైగ్రేన్ మొదలైందని వితికా షేరు కామెంట్లు చేశారు.ఈ రెండు వ్యాధుల వల్ల నేను ఇబ్బందులు పడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
గతంలో స్పాండిలైటిస్ తో బాధ పడినా నేను కోలుకున్నానని నేను ఆరోగ్యంగా ఉన్నానని అనుకునేలోపు ఈ వ్యాధి తిరగబెట్టిందని వితికా షేరు కామెంట్లు చేశారు.అందుకే కొంచెం బాధగా ఉందని వ్యాధిని పూర్తిగా నయం చేయలేమని త్వరగా కోలుకుని యూట్యూబ్ లో అద్భుతమైన వీడియోలు చేస్తానని వితికా షేరు చెప్పుకొచ్చారు.వితికా షేరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.