గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను చరణ్ ఎంజాయ్ చేస్తూనే వరుస సినిమాలను లైనప్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఇక ఈయన ఒక సినిమాను స్టార్ట్ చేస్తే ఆ సినిమా కోసం ఎంత డెడికేషన్ చూపిస్తారో ఇప్పటికే చాలా మంది చాలా సార్లు చెప్పుకొచ్చారు.ప్రముఖ దర్శకులు, హీరోయిన్స్ ఈయన వర్క్ గురించి చెబుతూ పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
అయితే తాజాగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఇది ఇప్పటి స్టేట్మెంట్ కాదు.
వీరిద్దరూ కలిసి పని చేసిన సమయంలో బోయపాటి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇంతకీ ఈయన ఏం కామెంట్ చేసారంటే.రామ్ చరణ్ ఒక కంప్లీట్ డైరెక్టర్స్ హీరో అని.డైరెక్టర్ బాబు నాకు ఇది కావాలి అంటే ఎందుకు ఏమిటి అని అడక్కుండానే చేసేస్తాడు అని.అలాగే వినయ విధేయ రామ ( Vinaya Vidheya Rama ) సినిమా సమయంలో నాకు ఇలా బాడీ ప్రిపేర్ చేసి కావాలి అని చెబితే ఇది 5 నెలల సమయం పడుతుందని చెప్పాడు.

కానీ నాకు సినిమా షూట్ చేసే లోపే కావాలని చెప్పగా రెండు నెలల్లోనే చేసి చూపించాడు.అంటూ బోయపాటి ( Boyapati Srinu ) చేసిన ఈ కామెంట్స్ నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.కాగా ప్రజెంట్ రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘‘గేమ్ ఛేంజర్’‘( Game Changer ) సినిమా చేస్తున్నాడు.
ఇది ఇప్పటికే షూటింగ్ చివరికి చేరుకుంది.కానీ రిలీజ్ డేట్ పై క్లారిటీ అనేది రాలేదు.







