తాజ్‌మహల్‌ను ఉచితంగా చూడండిలా.. పూర్తి వివరాలివే!

ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు భారత రాజధాని ఢిల్లీలోని తాజ్‌మహల్‌ అందాలను వీక్షించేందుకు తరచూ వస్తుంటారు.తాజ్‌మహల్‌ ఎల్లవేళలా పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది.

అయితే తాజ్‌మహల్‌ ఎంట్రీ ఫీజు దేశీయులకు, విదేశీయులకు వేర్వేరుగా ఉంటాయి.స్వదేశీయులకు రూ.300లోపే తాజ్‌మహల్‌ ఎంట్రీ ఫీజు ఉంటే.విదేశీయులు కాస్త ఎక్కువగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే శుక్రవారం రోజు తాజ్‌మహల్‌ సందర్శించడానికి అనుమతి లేదు.కానీ ఈ శుక్రవారం రోజు(నవంబర్ 19) తాజ్‌మహల్‌ అందాలను ఉచితంగా ఆస్వాదించేందుకు పర్యాటకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా.

ఈ నెల 19న శుక్రవారం తాజ్‌ మహల్‌ చూసేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయమని సదరు సంస్థ వెల్లడించింది.‘వరల్డ్‌ హెరిటేజ్‌ వీక్‌’ సందర్భంగా ఆగ్రాకోట, ఫతేపూర్‌ సిక్రీ, సికంద్రాలోని అక్బర్‌ సమాధి, ఇత్మాద్‌ ఉద్‌ దౌలాతో పాటు భారతదేశమంతటా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిధిలో ఉన్న అన్ని చారిత్రక కట్టడాల వద్ద ఫ్రీ ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

ప్రతి శుక్రవారం తాజ్‌మహల్‌ మూసే ఉంటుంది.అయితే ఈ శుక్రవారం తాజ్‌మహల్‌ తెరిచి ఉండడం విశేషం.ఈరోజు పౌర్ణమి కావడంతో పున్నమి వెన్నెల్లో తాజ్‌మహల్‌ పర్యటకుల చూపుతిప్పుకోనివ్వకుండా కనులవిందు చేయనుందని తెలుస్తోంది.

నవంబర్‌ 19-25 తేదీల్లో ‘వరల్డ్‌ హెరిటేజ్‌ వీక్‌’ ను యూనెస్కో నిర్వహించింది.దీనిని పురస్కరించుకుని ఎంట్రీ ఫీజును మినహాయిస్తున్నట్లు ఏఐఎస్‌ అధికారి తెలిపారు.

న్యూఢిల్లీలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫీస్ ఆదేశాల ప్రకారం, విదేశీ పర్యాటకులతో సహా అందరూ ఫ్రీగా తాజ్ మహల్ ను వీక్షించవచ్చని ఆర్కియాలజీ అధికారి వెల్లడించారు.వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్మారక చిహ్నాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని ఒక అధికారి తెలిపారు.ప్రస్తుతం భారతదేశమంతటా కరోనా తగ్గుముఖం పట్టిన వేళ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు