Salaar Movie : సలార్ మూవీకి పోటీగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. డైనోసార్ తో పోటీ అవసరమా అంటూ?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas )కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరికెక్కినటువంటి చిత్రం సలార్ ( Salaar ) ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.సలార్ విడుదల రోజునే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన డుంకి ( Dunki ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

 Vishwak Sen Wants To Release His Movie On December Here Details-TeluguStop.com

అయితే ప్రభాస్ సినిమా కూడా అదే రోజు విడుదలకు అన్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటించినటువంటి డుంకి సినిమా పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Telugu Salaar, Bollywood, Dunki, Gangs Godavari, Prabhas, Sharuk Khan, Tollywood

ఈ విధంగా సలార్ నుంచి షారుఖ్ ఖాన్ నటించిన సినిమా కూడా వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో టాలీవుడ్ అండ్ హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen ) మాత్రం తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs Of Godavari )సినిమాని ప్రభాస్ కి పోటీగా బరిలోకి దింపబోతున్నారు.ఇక ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.విశ్వక్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిజానికి డిసెంబర్ 8వ తేదీ విడుదల కావలసి ఉండగా సినిమా వాయిదా పడుతూ డిసెంబర్ 24వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

Telugu Salaar, Bollywood, Dunki, Gangs Godavari, Prabhas, Sharuk Khan, Tollywood

ఇలా ఈ సినిమా ప్రభాస్ సినిమాకు పోటీగా రానున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై స్పందిస్తూ డైనోసార్ తో పోటీ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ సినిమా మామూలుగా డిజాస్టర్ టాక్ అందుకుంటేనే వారం రోజులపాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.అలాంటిది సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా కలెక్షన్ల సునామీ ముందు మరే సినిమా అయినా కొట్టుకుపోవాల్సిందే ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం అవసరమా అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదలైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆదే సినిమాని చూడాలనుకోరు.

మరొక ఆప్షన్ కూడా వెతుకుతారు అలాంటి వారికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల కూడా ప్లస్ పాయింట్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.మరి ఈ సినిమా అదే రోజునే పోటీకి దిగుతుందా లేదా వెనకడుగు వేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube