బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీఎస్పీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని తెలిపారు.
నిస్సహాయతతో విద్యార్థిని ప్రవళిక బలవన్మరణానికి పాల్పడిందని రేణుకా చౌదరి పేర్కొన్నారు.పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని తెలిపారు.
బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు.ఐటీ కింగ్ అంటున్న మంత్రి కేటీఆర్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.







